కృతజ్ఞతలు, ధన్యవాదములు - ఈ రెండు పదాల మధ్య అర్థంలో గల తేడా ఏమిటి? వీటిని పర్యాయపదాలుగా వాడుకోవచ్చునా?
1 .కృతం అంటే చేసినది. జ్ఞ. అంటే తెలిసిన .కృతజ్ఞత అంటే చేసిన సహాయం మరచిపోకుండ ఉండడం. నేను నీవు చేసినది మరచిపోను—- అని చెప్పడం లో—-"కృతజ్ఞుణ్ణి" అంటాము. కేవలం జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోదు.
ఏదీ ఊరికే తీసుకోగూడదు, — ఋణపడిపోతాము.
అది తీరడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాలి.
కాబట్టి వీలైనపుడు దానికి బదులు ఎంత ఇవ్వాలో
అప్పటి మన స్థితినిబట్టి మనస్సాక్ష్యంతో తెలుసుకొని —-తీర్చేసి పోవాలి ..వీలుకానపుడు" చచ్చి నీ కడుపున పుడ్తాను" అంటాం గదా!. నీ కొడుకై నీకు సేవ చేసి నా వెనకటి బాకీ తీర్చేస్తాను —-అని చెప్పడం. . ఋణం ఏ జన్మకైనా తీర్చ వలసినదే..
విదుర సహాయంతో లక్కయింటి చావు తప్పించుకొని పాండవులు ఏక.చక్రపురంలో తల్లి తోపాటు ఒక బ్రాహ్మణుడి ఆశ్రయంలో బ్రాహ్మణ రూపాలలో ఉంటారు.
బకాసురుడికి ఆహారంగా ఆయన ఎవరో ఒకరిని ఆ నాడు పంపాలి. వాళ్లు ధార్మికంగా ఆలోచిస్తూ ఉంటారు. చివరికి ఆ విప్రుడే తాను ఆహారం కావడానికి నిశ్చయించుకొంటాడు. ఆ విషయాలన్నీ వింటున్న కుంతీదేవి వీళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చారు .!!ఈ ఋణం ఎట్ల తీర్చుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాను..ఇన్నాళ్ళకు అవకాశం వచ్చింది…అనుకొని ఆ బ్రాహ్మణునికి నచ్చ జెబుతుంది. "మా అబ్బాయి ని పంపుతాను. మీరు నిశ్చింతగా ఉండండి " అని.(అపుడు కొడుకులెవరూ అక్కడ లేరు).
ధర్మరాజు వస్తాడు."నీకు భీముడు వదలుకో దగిన వాడుగా అనిపించాడా? అని ధర్మ చర్చ చేయబోగా ఆమె వీడు చిన్నబిడ్డ గా ఉండగా అడవిలో సింహం తరుముకొన్నది.వీడు ఒడినుంచి జారి పడి రాళ్ళు పిండి అయ్యాయి.అపుడు అశరీర వాక్కు వినిపించింది "ఇతడు కౌరవ వినాశం చేస్తాడు" అని…కాబట్టి వీడు ఆ బకుడి పీడ విరగడ చేస్తాడని తెలిసి పంపుతున్నాను అని చెప్పింది.. ఇదీ..కృతజ్ఞత అంటే.
. (అయినా ఏ తల్లి ఇంత.ధైర్యం చేస్తుంది .)
2.నీవు చేసిన సహాయం వల్ల నా కష్టాలు తీరిపోయాయి. నా జన్మ సార్థకమైంది అనడంలో..ధన్యవాదములు . అంటాము రెండిటికీ తేడా ఉంది గదా.. కనుక తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము కనీసం వాళ్లను బాగా చూసుకొని కృతజ్ఞుడనై ఉండండి
సేకరణ. మానస సరోవరం 👏

No comments:
Post a Comment