Wednesday, May 25, 2022

ఒక్కొక్కసారి మనిషికి విపరీతమైన కోపం వస్తుంది.

040821.050821. 100522-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


మధుర_వాక్కు
➖➖➖✍️

ఒక్కొక్కసారి మనిషికి విపరీతమైన కోపం వస్తుంది.

ఉదాహరణకు తమ సంతానం తమ మాటలు వినకపోతే తల్లిదండ్రులకు చెప్పలేనంత కోపం వస్తుంది.

సంతానం కొంచెం క్రమశిక్షణను అతిక్రమించినా అణచుకోలేని కోపం వచ్చి కొడతారు కూడా, అది మంచిదికాదు.

కాని కోపం తగ్గిన తరువాత, తాము పిల్లలపై అంతగా ఆగ్రహాన్ని ప్రదర్శించవలసిన పనిలేదని ఆలోచిస్తారు.

మధురంగా మాట్లాడి పనిని పూర్తిచేసుకొనవచ్చును. మధురంగా మాట్లాడుటమంటే శాంత చిత్తులమైయుండటమే.

అప్పుడు ఎటువంటి దుప్ప్రభావానికి లోనుకాము. అందువలన మన పనికూడ పూర్తవుతుంది.

పరిస్థితులెలా ఉన్నా కోపంతో విజయాన్ని సాధించగలమని భావించకూడదు.

ఒక్కొక్కసారి కోపాన్ని నటించవచ్చు. కాని మనస్సులో మాత్రం లేశమాత్రమైనా కోపముండరాదు.

ప్రవహిస్తున్న జలం పర్వతం ఎదురైతే దానికి చుట్టూ తిరిగి మార్గం ఏర్పరుచుకుని రాళ్లమధ్య నుండి మార్గాన్ని వెదుక్కుంటుంది.

అలాగే కఠినమైన పదాలతో సాధించలేనిది మధురమైన వాక్కులతో సాధించవచ్చు.

కొన్ని సందర్భాలలో కరినమైన పదాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపవచ్చును.

भंक्तुं शक्तो यादृग्भवति मृदुस्यान्न तादृशस्तीक्षः |
अपि मृदु जलमपि निपतद्भिनन्ति शैलं क्षुरं न यत्नेन ||
కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి, కోపానికి తావివ్వకుండ, జీవితంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని జీవితాలను సన్మార్గంలో ఉండేటట్టు అలవరచుకోవాలి.✍️

|| हर नमः पार्वती पतये हरहर महादेव ||*

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.


. 🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment