Tuesday, May 24, 2022

రెండు మంచి మాటలు. దాని ఫలితంగా మనకు రానున్న మూడుతరాలలో భారతజాతి అంతరించి పోతుంది...

రెండు మంచి మాటలు

దేవుడు నిజాలు మాట్లాడమని నోరుని
అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే మనం మాత్రం అబద్ధాలను నోటితో
నిజాలను కళ్ళతో చూస్తున్నాం
మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం,మనిషిగా బ్రతకడం ఒక అద్భుతం
ఇన్ని అద్భుతాలు కలిగిన మనం అందరి మేలుకోరడం మహా అద్భుతం అవుతుంది!
మన సహాయం ఒకరి కడుపు నింపేదిలా ఉండాలి
దానికోసం మరొకరి కడుపు కొట్టేదిలా ఉండకూడదు!
మనం ప్రారంభాన్ని సరిగ్గా ఆరంభిస్తే
ఫలితం దానంతట అదే సరిగ్గా వస్తుంది!!
పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది
చచ్చినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది
ఈ రెండింటి మధ్య ఉన్నదే "జీవితం"
ఊపిరి ఎలాగో నిలుపుకోలేము కనీసం పేరునైనా నిలుపుకోవాలి
“ఆశయం” గొప్పదైతే,“ఆలోచన” పవిత్రమైతే,
“ఆత్మబలమే” ఆయుధమైతే, "విజయం" తప్పక వరిస్తుంది
“బంధం” బరువు కాకుడదు, “ప్రేమ” విరక్తి చెందకూడదు,
“మాటతో” విసుగు రాకూడదు, “ప్రవర్తనతో” పరువు పోకూడదు మరియు
“ఆలోచనలు” మితిమీరకూడదు హద్దు దాటితే అన్నీ ప్రమాదమే.
కాకులు పాటల పోటికి దిగినప్పుడు
కోకిల పాడకపోతేనే కదా గట్టిపోటి ఇచ్చినట్లు !
మనం కాకిగా మారిపోవాలా ! కోకిలలా మిగిలిపోవాలా !!
అన్నది మనమే తేల్చుకోవాలి.
కొన్నిసార్లు సూచనలతో సవరణలతో రాని మార్పు మౌనం వల్ల వస్తుంది
అయితే మాటల్లో బయటపడలేక మూగనోముతో మథనపడిపోతూ ఉంటే
ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసుకుంటూ ఉంటే అది మరింత ప్రమాదకరం !!
ఎదుటివారు చేసిన గాయాన్ని మరచిపోయే,మన్నీంచే పెద్ద మనసు నుంచి మొగ్గ తొడిగే
మౌనమే మధురమైంది ప్రస్తుత తరం సహనం
సంయమనాలను పిరికితనం అసమర్థతలని భ్రమపడుతుంది
ఎవరో చెప్పిన మాటల మాయావలయంలో పడి
ప్రతీకారం తీర్చుకోవడటమే ప్రధానమన్న పోకడలతో,
పోట్లాటల్లోను వ్యతిరేకతతో పోటీపడుతున్నారు.
మనం నవతర మని చెప్పుకుంటూ భావోద్రేకాలను నిమిషం కూడా
నియంత్రించుకోలేక పోతే ఏం ప్రయోజనం?
పాశ్చాత్యుల భౌతిక నాగరికత వెంట పరుగెత్తడానికి ఆధ్యాత్మికతను ప్రక్కకు నెట్టేస్తే
దాని ఫలితంగా మనకు రానున్న మూడుతరాలలో భారతజాతి అంతరించి పోతుంది
ఎందుకంటే అధ్యాత్మికతను వదిలిపెట్టిన రోజు భారతజాతి వెన్నెముకే విరిగిపోయి
జాతియత భావన అనే పునాది క్రుంగిపోతుంది
ఫలితం సర్వనాశనం

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment