Wednesday, June 29, 2022

మంచి మాట..లు(18-06-2022)

శనివారం :-18-06-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
నరుడే నారాయణుడు అంటారు.. అందరిలో దేముడు ఉంటాడు అంటారు.. మరి ఇతరులను మోసం చేయటం.. దోచుకోవటం.. మాటల చేతల ద్వార బాధ పెట్టటం చేస్తుంటాము.. మరి అటువంటప్పుడు.. పైవన్నీ దేముడికి చేస్తున్నట్లేగా..🤔 ఆలోచించండి

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది,
డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది,
సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది..

వంద బంధాలు ఉండవచ్చు, కానీ మనకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తాయి ఆ వందలో ఎన్ని బంధాలు నిజమైనవని...

మాటే కదా అని ఆలోచించకుండా ఇవ్వకండి.. మాట ఇస్తే తప్పక నెరవేర్చాలి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా.. మాట నేరవేర్చకపోతే మనం వారికీ ఋణగ్రస్తులమే అని గమనించండి

అనుభవం బట్టి ఫలితం ఎలా వస్తుందో.. అలానే మన ఆలోచనలు.. మన చేతల ద్వారా మనం చేసే పనులబట్టే దేముడు కూడా మనకు ప్రతిఫలం ఇస్తాడు అని గమనించండి
సేకరణ ✒️AVB సుబ్బారావు 🤝

సేకరణ

No comments:

Post a Comment