Thursday, June 16, 2022

ఈభూమి మీద మళ్ళీ జన్మ లేకుండా ముక్తినిపొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవాలి ఎప్పటికైనా (వదిలించుకోవాల్సిందే).

🌺☘️🌺 ఈభూమి మీద మళ్ళీ జన్మ లేకుండా ముక్తినిపొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవాలి ఎప్పటికైనా (వదిలించుకోవాల్సిందే). 🌺☘️🌺
👉 ఐతే వీటిని ఎలా వదిలించుకోవాలి ? అనేది తెలుసుకుందాం. 🌺☘️🌺
👉 మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసేపనులు అన్నీ కర్మలే .
👉 ఇలా ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయెంతవరకు కర్మలు చేస్తూనే వుంటాడు .
👉 ఇలా చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది (కర్మ ఫలితం ప్రకృతి సహజ గుణం).
👉 మనం చేసే ప్రతి కర్మ కూడా ఎపుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చియే తీరుతుంది.
👉 అవి ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలను ౩ రకాలుగా విభజించారు. అవి 1) అగామి కర్మలు, 2)సంచిత కర్మలు మరియు ౩)ప్రారబ్ద కర్మలు.
💐 అగామి కర్మలు 💐
👉 ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే.
👉 అయతే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి.కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివటం కోసం కూడబెట్టు కొనిఉంటాయి.
👉 ఉదాహరుణకు మనం భోజనం చేస్తాం. అది కూడా కర్మ.వెంటనే మన ఆకలి తీరుతుంది .
👉 ఎవరినైన కోపంతో తిడతాం.అవతలివాడు బలంగలవాడైతే చెంప పగలగొడుతాడు. అది కర్మఫలం.
👉 ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి.కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు.
👉 ఉదాహరునకు ఎదురుగాలేని వాణ్ణి తిడతాం.వాడిమీద నిందలు వేస్తాం.కానీ వాడు ఎదురుగలేడు గనుక అప్పటికప్పుడు ఫలితం రాదు.
👉 దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు.
👉 అలానే జీవహింస చేస్తాం దాని ఫలితం వెంటనే కనబడదు. ఏదోఒక రోజు అనుభవించి తీరాలి .
👉 మనం పరీక్షలు వ్రాస్తాం. ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది.ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి.ఇలా ఈ రకంగా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే.
🌏 సంచిత కర్మలు 🌏
👉 ఇంతకూ ముందు జన్మలో చేసి, తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టబడిన కర్మలలో నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించినవి పోను, మిగిలినకూడబెట్టబడిన కర్మలను, అదేవిదంగా అంతకుముందు జన్మలలో చేసిన కర్మఫలనుండి ఖర్చు అయినవిపోగా ఒక జన్మనుండి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంకుచిత కర్మలు అంటారు.
👉 జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా గాని ఈ సంచిత కర్మలు మాత్రం జీవున్ని విడిచి పెట్టకుండా అతడితో ప్రయాణమై వస్తుంటాయి.
👉 మనం అద్దె ఇళ్ళలో వుండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులను ఎలా ముటగట్టుకొని వేలతామో అలాగే జీవుడుకు శరీరం భగవంతుడు ఇచ్చిన అద్దె ఇంటిలాంటి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆశరీరంలో ఉన్నప్పుడు సంపాదించినా కర్మఫలాలను ముటగట్టుకొని తగిన మరొక అద్దేకొంపలాంటి ఇంకో శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా తీసుకువెళ్ళేవే సంచిత కర్మలు.
🌏 ప్రారబ్ధ కర్మలు 🌏
👉 అనేక సంచిత కర్మలు జీవుడితో కలిసి ప్రయనిస్తాయని చెప్పుకున్నాం.ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో , అప్పుడు అతడి account వున్న సంచిత కర్మల నుండి , ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో , పండుతాయో, ఫలితన్నివ్వటానికి సిద్దంగా ఉంటాయో వాటిని ప్రారబ్ద కర్మలు అంటారు.
👉 ఆ ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, తగిన శరీరంతో జీవుడు మళ్ళి ఈ లోకంలో ప్రవేసిస్తాడు .
👉 అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పుర్తియ్యేవరకు శరీరం వుంటుంది..
👉 భగవంతుడు మనకు అజ్ఞానంతో మరియు అవిద్యతో సంపాదించుకొని వున్న ప్రారబ్ద కర్మలను తొలగించుకోవడానికి మనకు (జీవునికి) మరొక శరీరాన్ని ఇస్తుంటే, మనం ఇక్కడ వాటిని వదిలించుకోవడానికి వచ్చి, చేసే కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికీ తోడూ ప్రోగు చేసుకుంటున్నాము.
👉 ఇది గమనించండి.ఇలా ప్రోగు చేసుకోవడం వలన మరల మరలా భగవంతుడు మనకు (జీవునికి), నీ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణిడిగా నా దగ్గరకు రమ్మని అతనికి మరల శరీరాన్ని ఇస్తున్నాడు.
👉 మనం ఏ రోజైతే సంపూర్ణంగా అన్ని కర్మలను ఈ స్థూల శరీరంతో సంపూర్ణంగా చేసి వదిలించుకుంటామో, మనం అప్పుడు మాత్రమే మన నివాస స్తానానికి చేరుకుంటాము.
👉 అదే పరమపదము , అదియే మన నివాస స్థానము.మనం అనుకున్న్నట్టుగా వున్న ఈ శరీరము కాదు , ఈ భూమిమీద వున్న ఇల్లు కాదు.
👉 నీ నివాస స్థానము ఈ సృష్టికి మూలకరణము అయిన పరమాత్మునిలో ఐక్యం(అదియే పరమపదము). “పునరపి జననం పునరపి మరణం .పునరపి జానీ జటరేశయనం” అని శంకరాచార్యుల వారు “భజగోవిందంలో చెప్పినట్లు మళ్ళీ మళ్ళీ చస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్బంలో ప్రవేశించాలి .
👉 ఇలా అయతే ముక్తి ఎప్పుడు ? మోక్షం ఎప్పుడు ? శాశ్వతానందం ఎప్పుడు ఈ జనన మరణాలనుండి విముక్తి చెందినప్పుడే అంటే మళ్ళీపుట్టుక లేకుండా పోయినప్పుడే
👉 మళ్ళీ పుట్టుకలేకుండా పోవాలంటే ఏం చేయాలి
👉 అసలు ఈ జన్మ (పుట్టుక) ఎందుకు వస్తుంది ?
👉 ప్రారబ్ద కర్మ ఫలాలను అనుభవించటానికి వస్తున్నది. ఆ ప్రారబ్దకర్మలే లేకపోతే పుట్టుకే లేదు .
👉 ఐతే ఈ ప్రారబ్ద కర్మలు ఎక్కడ నుండి వస్తున్నాయి?
👉 సంచితకర్మలలో నుండి పక్వమై వస్తున్నాయి.కనుక ప్రారబ్ద కర్మలు లేకుండా పోవాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి .
👉 అయితే సంచిత కర్మలు ఎలా వస్తున్నాయి ? మనం ముందు జన్మలో చేసిన ఆగామి కర్మలలో నుండి ఫలితాన్నిచ్చినవి పోను మిగిలిన కర్మలే సంచిత కర్మలుగా వస్తున్నవి.
👉 కనుక సంచిత కర్మలు చేయకుండా వుండాలి. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట.ఐతే కర్మలు చేయకుండా వుండటం ఎవరికైనా సాధ్యమేనా ?
👉 ఈ లోకంలో వ్యవహరిస్తూ కర్మ చెయ్యకుండా ఒక్కక్షణం కూడా ఉండలేము.అందుకే “భగవద్గీత” లో భగవానుడు శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు. నీవు కర్మలు చేస్తూనే ఉండు.కాని ఫలితాన్ని ఆశించకుండా ఉండు.
👉 అంటే ఈ లోకంలో కర్మలు చేస్తూనే జీవించాలి.ఇదే నీ కున్న మార్గం.మరొక మార్గం లేదు .
👉 కనుక జీవించినంత కాలం కర్మలు చేస్తూ వుండాల్సిందే.ఐతే ఎలాంటి కర్మలు చేయాలి ?
👉 జన్మ లేకుండా పోవాలంటే కర్మలు చేయకుండా వుండాలనుకున్నాం.కానీ కర్మలు చేయకుండా వుండడం ఒక్కక్షణం కూడా సాద్యం కాదని, జీవించి ఉన్నంత కలం కర్మలు చేస్తూ ఉండాల్సిందేననీ తెలుసుకున్నాం.
👉 ఐతే ఎలాంటి కర్మలు చేయాలి ?
👉 పాపకర్మలు, చెడ్డకర్మలు ( జీవహింస) చేశామా ? కష్టాలు, దుంఖాలు అనుభవించడానికి మళ్ళీ జన్మించాలి.
👉 పుణ్యకర్మలు, మంచి కర్మలు చేసామా ? సుఖాలు, భోగాలు అనుభవించటానికి దేవతలగానో జన్మించాలి
👉 అవి ఇవి కలగాపులగంగా చేసామా సుఖాన్ని, దుఃఖాన్ని. భాగాన్ని, మరియు రోగాన్ని అనుభవించడానికి మనవునిగా జన్మించాలి.
👉 కనుక ఎలాంటి కర్మలు చేసిన కర్మబందనం తప్పదు.జన్మ తప్పదు.
👉 అంటే పుణ్య కర్మలు చేస్తే బంగారు సంకెళ్ళు మరియు పాపకర్మలు చేస్తే ఇనుప సంకెళ్ళు అన్నమాట.రెండు సంకెళ్ళే, రెండును కూడా జీవున్ని బందించేవే
👉 కానీ మనకు కావలసింది విముక్తి వీటన్నిటినుండి సంపూర్ణంగా విముక్తి అదియే ముక్తి , మోక్షం , పరమపదం.
👉 ఈ కర్మలు బంధాలు కాకుండా వుండే ఉపాయం ఏమిటంటే , అగామి కర్మలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫలితన్నిచ్చే కర్మలు చేయవచ్చు. తర్వాత ఎప్పుడో ఫలితన్నిచ్చే విదంగా కర్మలు చేయకూడదు
👉 అంటే ఆగామి కర్మలు సంచితం కాకుండా , కూడబెట్టకుండా చాల చాల జాగ్రత్త పడాలి
👉 జాగత్త అంటే మనం దేవుని ముందర నిల్చొని చాట బారడం అంత లిస్టు అప్పచెప్పుతాం ఆ లిస్టు ఏంటో నేను చెప్పనక్కరలేదు అనుకుంట ఎందుకంటే అందరు దాదాపు చేసే పనులివే కదా. దేవుడా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, అంటే మనం అందరం మొదట భగవంతునిని కోరికలు కోరడం మానివేయాలి జరిగేదంతా మన మంచికే అని మన మనసును ధ్యాన సాధనతో స్తిరపరచాలి అన్న మాట).
👉 ఇక ప్రారబ్ద కర్మలను అనుభవించి ఖర్చు చేసుకోవాలే తప్ప ప్రోగు చేసుకోకూడదు.
👉 వీటిని మనం వదిలించుకోవాలి (ఇవి మనం అజ్ఞానముతో మరియు అవిద్యతో వచ్చిన కర్మలు).
👉 మరీ ఈ సంచిత కర్మలు తొందరగా అనుభవించేద్దమ అంటే అవి పక్వానికి రాలేదు .
👉 పోనీ జాగ్రత్త పాడుదామ అంటే , ఇప్పుడు జాగ్రత్త పడి ప్రయోజనం లేదు. అవి పాత కర్మలు. మరేమిటి ఉపాయం?
👉 వీటన్నిటిని ఒక్కసరిగా దగ్దం చేయాలి.ఎక్కడ దగ్దం చేయాలి, అదే జ్ఞానగ్నిలో, అంటే మన అజ్ఞానంతో కూడబెట్టుకున్న అన్ని కర్మలను మనం తెలుసుకుంటున్న జ్ఞానాగ్నిలో దగ్దం చేయాలి .
👉 అదియే అసలుసిసలైన ధ్యాన జ్ఞాన మార్గం.
👉 అంటే శ్వాస మీద ధ్యాస తో పాప కర్మలన్నీ దగ్ధం చేయాలి.
👉 ఈ ప్రకారంగా ఆగామి కర్మలు మరియు సంచిత కర్మలు వున్న వాటినన్నిటిని జ్ఞానగ్నిలో దగ్దం చేయాలి. దగ్దం చేసి జాగ్రత్త పడితే కర్మఫలాలంటూ ఇక వుండవు అప్పుడు కర్మ బందనాలు వుండవు, కర్మ బందనలు లేకపోతే జన్మలుండవు ఇదియే మనవ జీవిత లక్ష్యం
👉 మనిసి పుట్టుక సార్ధకత. అదియే మోక్షం , 👉 శాశ్వతానందం, ముక్తి. మనం అందుకోవలసిన స్తితి ఇదే, చేరవలసిన స్థానము ఇదే (అదియే మన గమ్యస్థానం).అయితే పైన చెప్పిన పద్దతుల్లో మనం సర్వకర్మ బందనాలనుండి విముక్తం కావాలంటే(జ్ఞానగ్నిలో ధగ్దం చేయాలి)అందుకు గొప్ప సాధన కావాలి.
👉 అటువంటి ధ్యాన సాధనకు మార్గం చూపేది, ఆ మార్గం వెంట మనసు చేయిపట్టుకొని నడిపించేది, లక్ష్యాన్ని చేర్చేది ఒక సద్గురువు మాత్తమే.
👉 “ధ్యాన యోగం” ద్వార సంచిత కర్మలను జ్ఞానగ్నిలో దగ్దం చేసుకోమని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఎంతో విపులంగా విషదీకరించాడు
👉 వీటితో పాటు భగవంతుని సాక్షాత్కారం (మన హృదయంలో దర్శించుకోవడం) కూడా ధ్యానయోగం ద్వార అని కూడా ఎంతో విపులంగా వివరించాడు.
👉అందువలన మనం అందరం చేయవలసిన పని మొదట ఈ అన్ని(కర్మ,భక్తి,జ్ఞాన) యోగాలతో పాటు భగవంతుని సాక్షాత్కారం ఎంతో బృహత్కర్యమైనదని నా ఉద్దేశ్యం, అందువలన వీటి అన్నిటితో పాటు ముఖ్యంగా ద్యాన యోగంతో ఆ దేవదేవునిని , ఆ భగవంతునిని మన హృదయంలో దర్శనం పొందడం ఎంతో ఉత్తమోత్తమమైనది. అదియే మనవ జీవిత పుట్టుక అసలుసిసలైన లక్ష్యము మరియు మనవ జీవితం యొక్క సార్ధకత. (అదియే ముక్తి, మోక్షము,పరమపదము
,శాశ్వతానందం).

No comments:

Post a Comment