Wednesday, June 1, 2022

భగవద్గీత - కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. వ్యక్తి ఎప్పుడు సర్వ నాశనమైపోతాడు? ఎవడు భగవంతుని కృపకు పాత్రుడగును? ఎవడు స్థిత ప్రజ్ఞుడు?

🌷శ్రీ భగవద్గీత 2వ అధ్యాయము : సాంఖ్య యోగము > శ్లోకం 62🌷

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।


ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది.

క్రోధం, లోభం, కామము మొదలగునవి వైదిక వాజ్ఞ్మయం లో మానసిక రోగాలు అని పరిగణించబడ్డాయి. రామాయణం ఇలా పేర్కొంటున్నది : మానస్ రోగ కచ్చుక మై గాయే హహిన్ సబ కే లఖి బిరలేన్హ పాయే. మనకందరికీ శారీరిక వ్యాధులు అంటే ఏమిటో తెలుసు - ఎదో ఒక్క శారీరిక జబ్బుకి కూడా మనిషి రోజంతా దుర్భరం చేసే శక్తి ఉంది. - కానీ మనము ప్రతి నిత్యం చాలా మానసిక రోగాలతో సతమతమౌతునట్టు మనకు తెలియట్లేదు. మనము కామ, క్రోధ, లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించక పోవటం వలన మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. మనస్తత్త్వశాస్త్రము అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం, అది ఈ వ్యాధులను విశ్లేషించి వాటికి పరిష్కారం సూచిస్తుంది. కానీ, పాశ్చాత్య మనస్తత్త్వశాస్త్రము సూచించే విశ్లేషణ మరియు పరిష్కారం రెండూ కూడా అసంపూర్తిగా ఉండి, మనస్సు యొక్క వాస్తవ తత్వానికి, గుండుగుత్తంగా ఒక అంచనా మాత్రమే అని అనిపిస్తుంది.

ఈ శ్లోకం ఇంకా తదుపరి శ్లోకం లో శ్రీ కృష్ణుడు మనస్సు యొక్క పనితీరుమీద సంపూర్ణమైన మరియు లోతైన అవగాహన కల్పించాడు. మనం ఒక వస్తువు వలన ఆనందం కలుగుతుంది అని పదే పదే అనుకుంటే, మనస్సుకి ఆ వస్తువుతో మమకార బంధం ఏర్పడుతుంది. ఉదాహరణకి, ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు, అమాయకంగా అందరూ కలిసి పని చేసుకుంటున్నారనుకుందాం. ఒక రోజు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి గురించి ఏదో గమనించి ఇలా అనుకుంటాడు, "ఆమె నాదవుతే ఏంతో బాగుంటుంది" అని. ఈ ఆలోచనని నిరంతరం మనస్సులో తిప్పటం వలన, అతని మనస్సు కి ఆమె పట్ల అనురక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతో, తను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, తన మనస్సు నిరంతరం ఆమె వైపే వెళ్తుండటం వలన చదవలేక పోతున్నానని చెప్తాడు. మేమందరం తరగతిలో ఆ అమ్మాయితో కలసి పని చేస్తున్నాము, మాకెవరికీ ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని, అతని స్నేహితులు వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్ర ని చెడగొట్టుకొని, ఇంకా తన చదువును పాడు చేసుకుంటున్నాడు? ఎందుకంటే, అతను, ఆ అమ్మాయిలో సుఖం ఉంది అని పదేపదే అనుకోవటం వలన అతని మనస్సుకు ఆమెతో మమకారానుబంధం ఏర్పడింది.

ఇప్పుడు ఆ అనురాగం మొదట్లో హానిచేయనిది గా అనిపిస్తుంది. కానీ, ప్రమాదం ఏమిటంటే అనురాగం నుండి కోరిక జనిస్తుంది. ఒక వ్యక్తికి తాగుడు మీద అనురాగం ఉంటే తాగుదామనే కోరిక పదే పదే మనస్సులో వస్తుంటుంది. ఒకడికి ధూమపానం మీద అనురాగం ఉంటే సిగరెట్టు తాగితే ఉండే ఆహ్లాదము మీదికే మనస్సులో తలపులు పదేపదే వస్తుంటాయి, అవి ఒకలాంటి యావ కలిగిస్తాయి. ఈ ప్రకారంగా, మమకారం అనేది కోరికలకు దారి తీస్తుంది.

ఒకసారి కోరిక జనిస్తే, అది ఇంకా రెండు సమస్యలను సృష్టిస్తుంది - లోభము (అత్యాశ) మరియు క్రోధము. కోరికలు తీరటం వలన అత్యాశ కలుగుతుంది. “జిమి ప్రతిలాభ లోభ అధికాఈ” (రామాయణం) “కోరికలను తీర్చుకుంటే అది అత్యాశ కు దారి తీస్తుంది.” కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా వాటిని పోగొట్టుకోలేము:

యత్పృథివ్యామ్ వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః
న దుహ్యంతి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే (భాగవతం 9.19.13)

"ఎవరికైనా ప్రపంచంలోని సమస్త సంపదలు, విలాసాలు మరియు భోగ వస్తువులు వచ్చినా అతని తృష్ణ చల్లారదు. కాబట్టి, దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకొని తెలివైన వ్యక్తి వాటిని త్యజించాలి."

మరోపక్క, కోరికలు తీర్చుకోటానికి ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అది కోపం కలుగ చేస్తుంది. గుర్తుంచుకోండి, కోపం అనేది దానికదే ఉత్పన్నమవదు. అది కోరికలకు ఆటంకం కలగటం నుండి వస్తుంది; కోరిక మమకారబంధం నుండి వస్తుంది; మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదేపదే ఆలోచించటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు విషయముల మీద పదేపదే చింతించటం అనే సాధారణ క్రియ, లోభము, క్రోధము అనే జంట రోగాల దిశగా పతనానికి దారి తీస్తుంది. తదుపరి శ్లోకం లో శ్రీ కృష్ణుడు ఈ క్రమమును మరింత లోతుగా చెప్పి క్రోధము యొక్క పరిణామాలను విశదీకరిస్తాడు.


🕉🚩శ్రీ భగవద్గీత 2వ అధ్యాయము : సాంఖ్య యోగము > శ్లోకం 63🚩🕉

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।


కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.

ఉదయం పూట పొగమంచు సూర్య కాంతిని కప్పివేసి తగ్గించినట్టు, కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేస్తారు, వారు దానికి తరువాత చింతిస్తారు, ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ది, భావోద్వేగాలచే కప్పి వేయబడుతుంది. జనులు అంటారు, "అతను నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమయింది?" నిజానికి ఏమయిందంటే, క్రోధం వలన విచక్షణ జ్ఞానం లోపించింది అందుకే పెద్ద వారిని దూషించే తప్పిదం జరిగింది.

బుద్ధి మబ్బుకమ్మినప్పుడు అది స్మృతి (జ్ఞాపక శక్తి) భ్రంశను కలుగ చేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి, భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాడు. అక్కడి నుండి ఇక అధో-పతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ది వినాశనాన్ని కలుగచేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది, అదే నశించినప్పుడు, వ్యక్తి సర్వ నాశనమైపోతాడు. ఈ విధంగా, దైవత్వం నుండి అధార్మికతకు పతనం అయ్యే ప్రక్రియ, ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది.

🚩శ్రీ భగవద్గీత 2వ అధ్యాయము : సాంఖ్య యోగము > శ్లోకం 64🚩

రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ।। 64 ।।


ఇంద్రియ విషయ/వస్తువులను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.

వినాశనానికి దారి తీసే అధోపతనం అంతా ఇంద్రియ వస్తు/విషయములలో ఆనందం ఉన్నదని చింతించటంతో ఆరంభమవుతుంది. ఇప్పుడు, దాహం వేయటం శరీరానికి ఎంత సహజమో, ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది. "నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను" అనుకోవటం అసంభవం, అందుకంటే అది ఆత్మకి అసహజము. అప్పుడు ఉన్న సులభమైన పరిష్కారం ఏమిటంటే, ఆనందాన్ని సరియైన దిశలో అంటే భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపు పదేపదే మననం చేస్తే, మనం ఆ భగవంతునితో అనురక్తి, మమకారబంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు; పైగా అది శుద్ది చేస్తుంది. పరమాత్మ పూర్తి పరిశుద్ధమైన వాడు, మనం మనస్సుని పరమాత్మ తో అనుసంధానం చేస్తే మన మనస్సు కూడా శుద్ది అవుతుంది.

ఈ విధంగా శ్రీ కృష్ణుడు మనలను కోరికలను, మమకారాన్ని త్యజించమన్నప్పుడు, అతను భౌతిక/ప్రాపంచిక మమకారాన్ని, కోరికలను మాత్రమే త్యజించమన్నట్టు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక (ఈశ్వరసంబంధమైన) మమకారం, కోరికలు త్యజించకూడదు, నిజానికి అవి మెచ్చదగినవి. వాటిని అలవర్చుకోవటం, పెంచుకోవటం అంతఃకరణ శుద్ధి కోసం అవసరం. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే, అంతఃకరణ అంత శుద్ది అవుతుంది. నిర్గుణ, నిరాకర అద్వైత బ్రహ్మం యొక్క ఉపాసన ని ప్రతిపాదించే జ్ఞానులు, అన్ని మమకారబంధాలను త్యజించమని చెప్పినప్పుడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. కానీ, శీ కృష్ణుడు ఇలా అంటున్నాడు "ఎవరైతే స్వచ్చమైన భక్తి తో వారి మనస్సుని నాయందే ఉంచుతారో, వారు మూడు ప్రకృతి గుణములకు అతీతులై, పరబ్రహ్మ స్థాయిని చేరుకుంటారు." (భగవత్ గీత 14.26) . శ్రీ కృష్ణుడు పదేపదే ఆర్జునుడిని తన మనస్సుని భగవంతుని యందే నిలుపమని ఇక ముందు శ్లోకాలలో (శ్లోకం 8.7, 8.14, 9.22, 9.34, 10.10, 12.8, 11.54, 18.55, 18.58, 18.65 మొదలగునవి ) విజ్ఞప్తి చేయుచున్నాడు.

రాగ ద్వేషాలు ఒకే నాణానికి ఉన్న రెండు పక్కలు. ద్వేషం అంటే వేరేఏమిటో కాదు, అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధం లో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదేపదే ఎలా జ్ఞప్తి కి వస్తుందో, అదే విధంగా ద్వేషం లో ఆ యొక్క ద్వేషింపబడే వస్తు/విషయం పదేపదే గుర్తుకు వస్తుంది. కాబట్టి, అనురాగము, ద్వేషము రెండూ కూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగ చేస్తాయి - అవి దాన్ని మైల పరిచి ప్రకృతి లో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి. మనస్సు రాగ-ద్వేషములకు అతీతంగా ఉండి , అది భగవత్ భక్తి లోనే నిమగ్నమై ఉన్నప్పుడు, వానికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ యొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత, మనస్సు కు ఆయా వస్తువులను వాడుతున్నా, ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అభిరుచి ఉండదు. ఈ ప్రకారంగా, మనందరి లాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా మరియు చూస్తున్నా , స్థిత ప్రజ్ఞుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటాడు.

🚩🌷శ్రీ భగవద్గీత 2వ అధ్యాయము : సాంఖ్య యోగము > శ్లోకం 65🌷🚩


ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ।। 65 ।।


భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలిగిపోయే పరమ శాంతి లభిస్తుంది. అలా ప్రసన్న చిత్తం తో ఉన్నవాని బుద్ధి శీఘ్రము గానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది.

కృప (అనుగ్రహం) అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోనికి వరద లాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి లాంటిది. తన కృప ద్వారా, సత్-చిత్-ఆనంద స్వరూపుడైన భగవంతుడు, తన దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇది బుద్ది ని భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం మరియు జ్ఞానం లో ముంచి వేస్తుంది. భగవంతుని కృప వలన మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో, ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి అన్నీ దుఃఖాలకు అతీతుడై, అతని మనస్సు శాంతినొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో, భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలం అని, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం అని, బుద్ది స్థిర నిశ్చయానికి వస్తుంది. దీనికి పూర్వం, వేదాల్లో చెప్పబడిన జ్ఞానం ఆధారంగా మాత్రమే బుద్ది దీనిని ఒప్పుకుంది, కానీ ఇప్పుడు, పరమ శాంతి యొక్క మరియు దివ్య ఆనంద ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. దీనితో ఎటువంటి సందేహానికీ తావు లేకుండా బుద్ది భగవంతుని యందే స్థిరముగా నిలుస్తుంది.
సేకరణ

No comments:

Post a Comment