నేటి మంచిమాట.
జీవితం సముద్రం ఒడ్డూన మెరిసే నీటి బుడగ లాంటిది. నీటి బుడగ దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. తెల్లవారు జామున వచ్చే లేత సూర్య కిరణాలు దానిపై పడినప్పుడు ఏడు రంగుల ఇంధ్రధనస్సు ఏర్పడుతుంది ఆ ఇంధ్రధనస్సు యెక్క రంగులతో మెరిసిపోతుంది. ఇదంతా దూరం నుండి చూసినప్పుడు, కాని దగ్గరకు వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అది పగిలిపోయి మాయమైపోతుంది.
జీవితం కూడా అంతే నీటి బుడగ లాంటిది. దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. కాని జీవితం లోతుల్లోకి వెళ్లి చూస్తే మనిషి ఇంత ఆశలతో కోరికలతో తలమునకలై జీవిస్తుంటే మరణం అనేది వచ్చి అన్నిటిని కూల్చేసి జీవితం అశాశ్వతమైనది నీటి బుడగలాంటిది అనే సత్యం ప్రకటిస్తుంది. దీనినే మృగమరీచిక అంటారు.
దూరం నుండి అందంగా ఉండేవన్ని దగ్గరకు వచ్చాక సత్యం ప్రకటిటమయ్యాక అందంగా ఉండవు. అదంతా మన భ్రమ. అందుకే మనిషి జీవితం బురదలో కమలంలా ఉండాలి. దేన్ని ఆశించకుండా, అతిగా వెళ్లకుండా సమంగా ఉండాలి. ఏలాగైతే పువ్వులో మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద పువ్వుకు ఎలాంటి హాని చేయకుండా తీయదనాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే మనిషి ఈ ప్రపంచం యొక్క ఆకర్షణల్లొ , బంధాల్లో చిక్కుకోకుండా స్థితప్రజ్ఞాతతో జీవించాలి. అలా కాకుండా కొన్ని తుమ్మెదలు పూలల్లో మకరందాన్ని ఆస్వాదిస్తూ తమని తాము మర్చిపోయి ఆ పువ్వు ముడుచుకున్నప్పుడు ఆ రెక్కల మధ్యల్లో పడి చచ్చిపోతాయి.
చాలా మంది మనుషుల జీవితాలు కూడా అలాగే ఆకర్షణల్లో చిక్కుకొని మరణిస్తారు. జీవితమంటే తామరాకు మీద నీటి బిందువులా నిర్లిప్తంగా ఉండాలి. జ్ఞానోదయం పొందడానికి అదే తొలి అడుగు అవుతుంది.
శుభోదయం చెప్తూ మానస సరో వరం 👏
No comments:
Post a Comment