Tuesday, June 28, 2022

జ్ఞానం, పత్రీజీ సమాధానాలు

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺

🌹 *చాప్టర్ -- 4 :--- జ్ఞానం* 🌹


🍁 *ప్రశ్న :---* నా పెళ్ళి అయిన తర్వాత వేరే దేశానికి మకాం మార్చటంతో గత కొద్ది నెలలుగా నేనెన్నో మార్పులను ఎదుర్కొంటూ వస్తున్నాను. ఇది సుదూర తీరాలకు నన్ను నెట్టివేసినట్లుగా అన్పించింది. నేను జీవితంలో ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు మరి సంబంధ బాంధవ్యాల్లో అయినా నెగ్గుకు రాగలను అని ఎంతో ఆత్మ విశ్వాసం వచ్చింది. 

నేను నేర్చుకున్నదంతా ముఖ్యంగా జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, దైనందిన జీవితంలోని ప్రతి పరిస్థితి, ప్రతి అనుభవం... అన్నింటినీ ఆనందంగా స్వీకరించే వాళ్ళతో కలిసి ఉండటమే అని నేను తెలుసుకుంటున్నాను.

దేన్నీ విశ్లేషించరు. తార్కికంగా ఉండరు. ఇది నాకు ఎంతో  ప్రత్యేకమైన పాఠం. కనువిప్పు కలిగించేలా ఉందని చెప్పాలి. ఇదంతా మానసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన లేని వ్యక్తులను కలుసుకోవటం ద్వారా తెలిసింది. వాళ్ళలో కొందరు ధ్యానం చేసినప్పటికీ అదంతా కూడా ప్రార్థనల రూపంలోనే ఉంటుంది.


ప్రార్థనలతో ధ్యానాన్ని కలపటం వల్ల అనుకుంటా నాకు అంతా ఒక్కటిగానే అన్పిస్తుంది. మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం కదా ! అన్నింటినీ మించి ధ్యానం నాకు క్రమశిక్షణను నేర్పింది. ఎంతటి జ్ఞానం ఉన్నా సరే మన జీవితాల్లో ఇది లేకపోతే కనుక ఎంతో లోటుగానే ఉంటుంది కదా ! 


ఒకవేళ మన జీవితాల్లో క్రమశిక్షణ లేనట్లయితే మరి ఆ జీవితాన్ని నిజంగా ఊహించుకోలేం. నేను ఏ విధమైన క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నానంటే, ఒకచోట హాయిగా కూర్చుని, శక్తి ప్రవాహాన్నీ, నన్నూ ఒకే అంశంపైన కేంద్రీకరించటం గురించి చెప్తున్నాను. మరి ఇది నాకు ఒక వ్యాయామం వంటిది. ఇది నా అస్తిత్వం అంతా కలిసి చేసేలా నేను వ్యాయామం అన్నమాట. ఇది మానసికమైనది కాదు. ఆత్మ పరమైన వ్యాయామం అని చెప్ప వచ్చు. మరి ఇది అస్తిత్వం అంతటినీ గొప్ప సమర్థవంతంగా చేయటంలో ఎంతగానో దోహదపడుతుంది. నేనిప్పుడు ఆనందంగా ఉన్నానని చెప్పటం లేదు. నేను అనుభవించిన వేదనాభరితమైన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక నేను అలానే ఉన్నాను. ప్రతి మానవుడికి సహజంగా ఉండే భావోద్వేగాలన్నీ నాలోనూ ఉన్నాయి.


 విచారం, బాధ, కోపం వంటి సాధారణ మానవుల భావోద్వేగాలను నేను ఏ మాత్రం ప్రతికూల భావోద్వేగాలు అని చెప్పను. 


ఇటువంటి భావాలు అన్నింటినీ దాటి (వాటిని కలిగి ఉన్నప్పటికీ) వాటిని అధిగమించి చూడగలిగేలా ధ్యానం నాకు తోడ్పడింది. ఇంతకు ముందు నాకు ఏదైనా బాధ, దుఃఖం అన్పిస్తే తట్టుకోలేను కనుక అటువంటివేవీ నా జీవితంలో ఉండకూడదు అనే భయంతో ఉండేదాన్ని. 


ఈ బాధ నుంచి తప్పించుకుని పారిపోవటానికీ మరి దీన్ని పరిష్కరించటానికీ ఎన్నెన్నో చేసేదాన్ని. వృత్తిపరంగా రాణించాను. 


అయితే బాధ అనివార్యమైనది అని నేను కనుక్కున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నంత వరకూ ఏదో ఒక రూపంలో అది తప్పక ఉంటూనే ఉంటుంది. ఈ జీవితంలో మనకి ఇవ్వబడిన పని ఏమిటంటే బాధతో స్నేహం చెయ్యటం ఎలా అనే మార్గాన్ని కనుక్కోవాలి. అదే మనందరి ప్రయాణం. ఎందుకంటే బాధ మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. మరి బాధతో స్నేహం చెయ్యాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం క్రమశిక్షణతో ఉండటం అని నేను అనుకుంటున్నాను. మరి ఇదే నా ధ్యాన ప్రయాణం.


బాధను అధిగమించటానికీ, మైత్రి చెయ్యటానికీ, అవగాహన చేసుకోవటానికీ, మౌలికంగా బాధను నాలోకి అనుమతించటానికీ ధ్యానం నాకు ఇతోధికంగా తోడ్పడింది. ఇది నన్ను వికసింప చేసింది. కనుక ఇప్పుడు, ఈ క్షణంలో నేనెంతో శక్తివంతంగా ఉన్నాను. దూసుకుపోతాను అన్పిస్తోంది. నేను నిజంగా సంతోషాల కోసం ఎదురుచూడటం లేదు. ఎందుకంటే నా జీవిత లక్ష్యం అంతర శక్తిని పెంపొందించుకోవటమే అని నాకనిపిస్తోంది. నా గమ్యం అదే. ఒక వేళ అంతర శక్తి ఉందంటే దాని వెన్నంటే ఆనందాలూ వెల్లువలా వస్తాయి. నేను అది పొందాననే అనుకుంటున్నాను. ధ్యానం చెయ్యటం ద్వారా ఆ శక్తిని కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు చెయ్యవలసింది ఏమిటంటే ఆత్మబలాన్ని కాపాడుకుంటూ సాగటం. దయచేసి నేనెక్కడైనా సరిగ్గా లేకపోతే నన్ను సరిదిద్దండి?


🍀 *పత్రీజీ :---* అవును. ధ్యానం మనం అంతర శక్తిని పెంపొందిస్తుంది. దేహ బలం కండరాల పై ఆధారపడితే, ఆత్మ బలం ధ్యానం పై ఆధార పడుతుంది. కండరాలు పెంచుకోవటానికి మీరు శారీరక వ్యాయామం చెయ్యాలి. ఆత్మ బలం పెంపొందించుకోవటానికి ధ్యానం చెయ్యాలి.


🌳 ధ్యానం అంటే మనస్సుకు క్రమశిక్షణను ఇవ్వటం. మనస్సుకు క్రమశిక్షణను ఇవ్వవలసిందే. మనస్సుకు శిక్షణను ఎలా ఇస్తారు మీరు? ధ్యానం ద్వారా, ఆలోచనలు చేయకుండా ఉండటం ద్వారా, కేవలం శ్వాస ధారను గమనించటం ద్వారా మీ మనస్సును శూన్యం చేస్తున్నారు. మనస్సుకు శిక్షణను ఇస్తున్నారు. ధ్యానం అంటేనే మనస్సుకు శిక్షణను ఇవ్వటం. మనస్సును క్రమశిక్షణలో ఉంచాలి. లేదంటే అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్తుంది. అన్నింటిలో మునిగి పోతుంది. 


🌿 మరి మనస్సు శిక్షణ పొందాలి . అది ధ్యానమే ఇస్తుంది. నేను నలబై సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళకీ మానసిక శిక్షణ గురించి బోధిస్తూ ఉన్నాను. సహజమైన, సాధారణమైన శ్వాసను గమనిస్తూన్నప్పుడు మీరు మీ మనస్సుకు శిక్షణను ఇస్తారు. కనుక మీ కళ్ళు మూసుకోండి. సహజమైన శ్వాసతో ఏకంకండి. 


🌳 మనస్సు గురించి విశ్లేషణ వద్దు. కేవలం మనస్సును క్రమశిక్షణలో ఉంచాలి. చిత్త శుద్ధి లేని మనస్సు గురించి ఎన్ని విశ్లేషణలు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. మనస్సును సరియైన ధ్యాన సాధన ద్వారా నియంత్రణలోకి తేవాలి. ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారా మనస్సు శూన్యం అయిపోతుంది. కనుక దయచేసి అందరికీ ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పించండి. మీ దగ్గరకు వచ్చే మీ బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరికీ ఈ విధంగా ధ్యానం నేర్పి సహాయ పడండి. వాళ్ళ మనస్సులను విశ్లేషించకండి. ఏ జంతువూ మరో జంతువును విశ్లేషించదు. మరి మనుష్యులు ఎందుకు వేరే మనుష్యులను విశ్లేషిస్తూ ఉంటారు? మనుష్యులందరూ పిచ్చి వాళ్ళు అనుకుంటాయి జంతువులన్నీ, వాస్తవానికి పిచ్చి వాళ్ళే మరి. ఒక పిచ్చి కుక్క అనేది ఉండదు. *“పిచ్చి పిల్లి”* అనేది ఉండదు. అయితే పిచ్చి వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటారు. 


🌸 ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకదాన్ని విశ్లేషించుకుంటూ ఉంటారు. ఏ జంతువూ అలా చెయ్యదు. ఏ పక్షి అలా చెయ్యదు. ఏ చేపా అలా చెయ్యదు. కేవలం మనుష్యులు మాత్రమే అలా చేస్తారు. మరి ఆ విశ్లేషణతో తమకు తామే నరకాన్ని సృష్టించుకుంటారు. 


🏵️ ధ్యానం అంటే ఎలాంటి విశ్లేషణలూ చెయ్యకపోవటం. నేను నేనే. మీరు మీరే. నేను మిమ్మల్ని మీరుగా అంగీకరిస్తాను. నేను మిమ్మల్ని విశ్లేషించను. నన్ను నేనుగా అంగీకరించుకుంటాను. నన్ను నేను విశ్లేషించను. నేను ఒక మూర్ఖుడిని. అయితేనేం? నేను ఒక వెధవని. అయితే ఏంటిట? 


🌻 ఒక జంతువులా... ఒక కుక్కలా... ఒక పిల్లిలా నేను ఆనందంగా ఉంటాను. ఒక కుక్క ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక పిల్లి ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక చేప ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. ఒక పక్షి ఎంత ఆనందంగా ఉంటుందో నేనూ అంత ఆనందంగా ఉంటాను. 


🌿 మీరంతా కూడా పక్షిలా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను.  మీరంతా కూడా పిల్లిలా ఆనందంగా ఉండాలి.  అనుకుంటున్నాను. మీరంతా కూడా చేపలా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను. మీరంతా కూడా కుక్కలా ఆనందంగా ఉండాలి. అనుకుంటున్నాను. ఒక మనిషిలా బాధ పడకూడదు. మీకు నమస్కారములు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



No comments:

Post a Comment