Friday, June 10, 2022

మంచి సమాజం కోసం మనం మారాల

మంచి సమాజం కోసం మనం మారాల

పరీక్ష పాస్ అయ్యామా! మందు పార్టీ,,
పరీక్ష ఫెయిలయ్యామా! మందుపార్టీ..

అమ్మాయి చూసి నవ్విందా! మందుపార్టీ,,
అమ్మాయి తిట్టిందా ! మందు పార్టీ...
అమ్మాయితో బ్రేకప్ అయిందా! మందుపార్టీ..
లవ్ లోపడ్డావా నాయనా! మందుపార్టీ ...

లెక్చరర్ మార్కులు రాలేదన్నాడా! మందుపార్టీ ...
మార్కులు ఎక్కువగా వచ్చాయా! మందుపార్టీ ...

సందర్భమేదైనా మందుపార్టీ కామన్,.. అసలు మందుపార్టీలు కామన్,.సందర్భం అల్లుకోబడుతుంది.. ఇది సినిమాలలో నిత్యం చూపిస్తూ అదేదో జీవిత పరమార్ధం అన్నట్లు, ఎంజాయ్ అంటే పార్టీ చేయాల.. పార్టీ చేసుకోవాల అంటే మందేయాల అనే కల్చర్ సమాజంలో కల్పించబడింది...

ఇక డబ్బు ఎక్కువగా ఉన్న పిల్లలకు పబ్ కల్చర్.. ఓ అమ్మాయికి ఓ అబ్బాయి బాయ్ ఫ్రెండు ఉండాల..లేకుంటే రానివ్వరు.. అసలు బాయ్ ఫ్రెండులేడంటే సత్తెకాలపు సత్తెమ్మ,.రిజెక్టెడ్ బ్యాచ్ అట... ఆ DJ కు డాన్సు చేయాల,,, టకీలా వేసుకోవాలట,,. లేకుంటే ఎగరలేరు.. ఆడలేదు మగలేదు.. పబ్బుకెళ్ళాక పట్టించకుండా ఉంటారా..

సందట్లో సడేమియాలా డ్రగ్సు పెడలర్సు బ్యాచీలు.. ఉన్న పిల్లలే టార్గెట్,,, ఇక అలవాటు కావడం ఈజీ.. తరవాత బురదలో కూరుకు పోవడమే..నైట్ లైఫ్ అట,,, అసలు అది లేకుంటే విలవిల లాడుతారు., మధ్యతరగతి పిల్లలు అలవాటయాక ఇంట్లో దొంగగా తీసుకొని పోతారు.. తల్లితండ్రులు తెలిసినా తెలియనట్లుంటారు..

ఇవి చాలవని రేవు పార్టీలట... ఆడమగ అందరూ వెళ్ళి తీర్ధప్రసాదాలతో మూడు రోజులు బీచ్ లలో జరపతారట,. నగర శివారు గెస్టు హౌస్లలో ఇవి సర్వసాధారణమట.. మందు, డ్రగ్సు, కోకెయిన్ లాంటివి ఏరులై పారిస్తారట.. సాఫ్టువేరు మొదట వచ్చినపుడు వీకెండు పార్టీలని గోల...

ఇన్ని విధాలుగా సమాజాన్ని చెడగొట్టుకోని ఇక వగచుట ఏల?.. పాశ్చాత్య నాగరికత కావాల,. కావాల అంటే అలాగే అంటాది.. నాగలరికత కేవలం బర్గర్లు పిజ్జాలతోనే ఆగదు.. ఇలా అన్ని దారులు తెరుస్తాది,,
ఆల్కహాలు, డ్రగ్సు, సెక్సు, కాండమ్ లు, అబార్షన్లు, ఐ పిల్సు చాలా కామన్... ఐ పిల్ అంటే తెలియని వారే లేరు అని తెలిసినపుడు ఆశ్చర్యపోయాను,,. మరలా రేపు అని అదేదో 12 శతాబ్దంలో జరిగినట్లు బాధపడడం ఎందుకు,.. పాశ్చాత్య నాగరికత లో దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు.. అదో కండీషన్డు, అన్ కంట్రోలబుల్ ఎమోషనల్ ఫిజికల్ రెస్పాన్సు.. అది హార్మొన్ల అలజడిలో వున్న పిల్లలలో కామన్.. కోప్పడకండి,. ఆలోచించండి... తప్పయినా రోజు 4 రేపులు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి,. ఎందుకు తప్పయినా తెలిసినా జరుగుతుంది..

ఎవరిది తప్పు.. సమాజం వీటన్నిటినీ ఆక్సెప్టు చేయడం తప్పు.. ప్రభుత్వాలు అనుమతించడం తప్పు,., తల్లితండ్రులు తము సంపాదించినది పిల్లలు ఖర్చు చేస్తున్నా చూసిచూడనట్లుండడం తప్పు,. వాళ్ళ మనసులను కలుషితం చేసే సామాజిక మాధ్యమాలది తప్పు,, ఆ పబ్బు కల్చర్ తప్పు,.. అదేదో గొప్పదని ప్రొజక్టు చేసే మాధ్యమాలది తప్పు... మందు విచ్చలవిడిగా బహిరంగంగా తాగడం తప్పు... శిక్షలు వేయలేకపోవడం తప్పు., భయం లేకపోవడం తప్పు.. అసలు అది కామన్, మా కల్చర్ అనేదీ తప్పు.. అది మన కల్చర్ లో దూరనిచ్చామే అదీ తప్పు,.

తప్పు తప్పు తప్పు... ఒప్పు ఒప్పు ఒప్పు... తప్పు ఒప్పుగా మారాక మరలా ఒప్పును తప్పు తప్పు గా పరిగణించాలంటే చాలా కష్ఠం.. సమాజంలో విలువలు పతనం కావడం సులభం.. విలువలు పెంచడం కష్ఠం..

మనం మరో సామాజిక మార్పు కోసం పని చేయాల్సిన సమయం వచ్చింది,. తప్పును తప్పు అని మన భారతీయసాంప్రదాయాలు గొప్పవని తెలిపి సమాజిక మార్పునకు కృషిచేయగల సామాజిక కార్యకర్తలు, నాయకులు, మాధ్యమాలు కళ్ళుతెరచి మార్పు కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది,,

అపుడే తప్పు అనేది సమాజం నుంచి పోతుంది.. ఒప్పవుతుంది,,. మంచి సమాజం లో మనముండాలంటే అందరూ మారక తప్పదు..

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

సేకరణ

No comments:

Post a Comment