🎪చుట్టరికం
💦🌹🌈⛳
🍁గతంలో
నాలుగు జతల బట్టలు సర్దుకొని
నాలుగు రోజులు చుట్టరికం చేసి రావడం
ఒక గొప్ప మధురానుభూతి !
ఊరి పొలిమేరలనుండి స్వాగతం పలికే
ఉమ్మడి బంధువుల చిరునవ్వు
మనసును ఎంతగానో మురిపించేది !
పలకరింపులు పూర్తయ్యేక
మా యోగక్షేమాలడిగి ఆనందించేవారు !
పూటపూటకో కొత్త వంట రుచి చూపించి
మాటమాటకో కొత్త విషయాన్ని
చెవిలో వేసేవారు !
మా ఊరి విషయాల మూటలు
నేను ఒక్కొక్కటిగా విప్పుతుంటే
బంధువుల హృదయాలు పులకించిపోయేవి !
సాయంత్రం వేళల్లో టూరింగ్ టాకీసులో
సినిమాలు చూపించి సంబరపడిపోయేవారు !
రాత్రిపూట కబుర్ల దుప్పటి కప్పి
వెచ్చని మమతలు మిగిల్చేవారు !
మా ఇంటికి చుట్టాలొచ్చినా
అదే కథ యథాతథం !
బంధాలు బలపడటం చుట్టరికం ప్రత్యేకత.
వివాహ బంధాలు ముడివడటం
చుట్టరికాల ఘనత.
పరస్పరం భరోసా కల్పించుకోవడం
చుట్టరికాల్లో గొప్ప విశిష్టత !
ఆధునీకరణ, నగరీకరణ,
ఆర్ధిక సంబంధీకరణ కారణంగా
నేడు కనుమరుగైపోయిన
చుట్టరికాల వ్యవస్థను
ప్రభుత్వాలు చట్టరికం చేస్తే
విచ్చిన్నమైపోతున్న ఉమ్మడి కుటుంబాలు
మరల ఊపిరి పోసుకుంటాయి !
మానవ సంబంధాలు
మరింత పటిష్టంగా పెనవేసుకుంటాయి !
ఉండండి
మరలా నిత్యనూతనంగా
నాలుగు రోజులు చుట్టరికం చేయడానికి
నాలుగు జతల బట్టలు సర్దుకొని మీ వద్దకు వస్తాను ! ఓకేనా
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
No comments:
Post a Comment