Thursday, June 23, 2022

నేటి చిట్టి కథ, సిరిసంపదలు & ఆరోగ్యం

✍️........... 🌻 నేటి చిట్టి కథ 🌻

🥀కృష్ణాపురం లో భాగ్యరాజు,సోమరాజు మిత్రులు ఉండేవారు.ఇద్దరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు.

🥀తిరుగు ప్రయాణంలో వారు ఒక అడవి మార్గాన వస్తూంటే వారికి ఒక గుట్ట మీద దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యోగి కనిపిస్తాడు.

🥀ఇద్దరూ వెళ్లిఆ యోగికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఆ యోగి ఏ కళనున్నాడో ఆ ఇద్దరకు మేలు చేయదలిచాడు."భక్తులారా! ఈ గుట్టకు ఉత్తర దిక్కుగాఉన్న సరస్సులో స్నానం చేస్తే మీకు మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి. తూర్పుదిక్కుగా ఉన్న సరస్సులో స్నానం చేస్తే ఆరోగ్యం సమకూరుతుంది.

🥀స్నానం చేసే ముందు రెండు నియమాలు పాటిస్తామని మనసులో ప్రమాణంచేసుకోవాలి.

🥀ఒకటో నియమం ఒక సరస్సులోమాత్రమే స్నానం చేయాలి. దురాశతో రెండు సరస్సుల్లో స్నానం చేస్తే ఏ ఫలితమూ దక్కదు.

🥀రెండో నియమం - ఇక్కడ నేనున్నానన్న విషయంఎవరితో చెప్పకూడదు. ఒకవేళ చెప్పేరా ఈ వర ఫలితం దక్కదు అని చెప్పి తపస్సులో మునిగిపోతాడు యోగి.

🥀అనుకోకుండా వచ్చిన అదృష్టానికి ఇద్దరు మిత్రులు ఆనందించారు. అంతా భగవంతుని లీల అనుకుంటూ గుట్ట దిగారు. భాగ్యరాజు " ఐశ్వర్యం కలిగితే అన్నీ సమకూర్చుకోవచ్చు. ఉత్తర దిక్కు నున్న సరస్సు లో మునుగుదాం రా"అని సోమరాజు తో అన్నాడు.

🥀సోమరాజు అప్పుడు " ఆరోగ్యమే మహాభాగ్యం.దానిని మించిన భాగ్యం లేదని నా విశ్వాసం. తూర్పు దిక్కుకే పోదాం రా" అంటాడు ఇద్దరూ ఒక మాటకు రాలేకపోయారు.

🥀భాగ్యరాజు ఉత్తర సరస్సులోను సోమరాజు తూర్పు సరస్సులోను స్నానం చేసి ఇంటికి బయలుదేరారు.

🥀నగరం చేరాక భాగ్యరాజు ఏ పని చేసినాఅదృష్టం వరించేది.వ్యాపారంలో లాభాలు వచ్చిపడుతున్నాయి.
అంతా యోగి మహిమని యోగికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

🥀ఇక సోమరాజు విషయానికి వస్తే ఎప్పుడూ మంచం పట్టి మూలుగుతూ వుండే అతడి భార్య ఆరోగ్యంతో కళ కళ లాడి కనిపించింది. పిల్లలు పుష్టిగ తయారయ్యారు. సోమరాజుకు అపుడపుడువచ్చే అనారోగ్యం మాయమయింది.

🥀వైద్యులువద్దకు వెళ్ళే అవసరం రాలేదు. సోమరాజు యోగిని కృతజ్ఞతతో తలచుకున్నాడు.కొంత కాలంగడిచింది. ఒకరోజు అంగడిలో ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. భాగ్యరాజు దిగులుగా కనిపించాడు.

🥀ఏమలా ఉన్నావని అడిగాడు సోమరాజు. అప్పుడు భాగ్యరాజు యోగి ఇచ్చిన వరం ఎంచుకోవడంలో నేను పొరబడ్డాను.ఆరోగ్యంలేనప్పుడు ధనమెంత ఉన్నా ప్రయోజనం లేదు.రెండు ముద్దలు తిని అరిగించు కోలేకపోతున్నాను.జిహ్వచాపల్యాన్ని బలవంతంగా అణచుకుంటున్నాను.ఇంట్లో ఎవరికో ఒకరికిఅనారోగ్యం ఉంటూనే ఉంది. సంపాదనంతావైద్యానికే సరిపోతుంది. సుఖశాంతులు లేవు.ఈ పరిస్థితుల్లో ఉత్సాహం ఎలా వుంటుంది మిత్రమా? " అని బాధపడ్డాడు.

🥀సోమరాజును పట్టుకుని ఏడ్చాడు. సోమరాజు అప్పుడు "సంతోషమే సగం బలం. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. దిగులు పడితే ప్రయోజనం లేదు."అని మిత్రుడిని ఓదార్చాడు.

వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥

🥀వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యం. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము.


☘️☘️🌼🌼🌼🥀🌼🌼🌼☘️☘️

సేకరణ

No comments:

Post a Comment