Wednesday, June 29, 2022

మందలో మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలేయాలి.

 🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺

🌴 ఆవు గడ్డి తిని పాలు ఇస్తుంది. పాలు త్రాగి విషం ఇస్తుంది పాము. కొందరి గుణాలు ఇలానే ఉంటాయి. కనుక మన చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ ఉండాలి. మంచిని మాత్రమే గ్రహిస్తూ చెడును గమనిస్తూ ఉండాలి. కష్టం అయినా సరే మంచి మార్గము గుండా పోవడానికి ప్రయత్నం చెయ్యాలి. చెడ్డవారి సాంగత్యమునకు పూర్తిగా దూరముగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి వారి మాటలు వలన మనలోని మంచి భావాలు, మంచి ఆలోచనలు అడగంటుకు పోయే ప్రమాదమూ లేకపోలేదు. కనుక అందరినీ కలుపుకుంటూ పోవాలి. కానీ మందలో మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలేయాలి. అదే మనకు ఆనందకరమైన, ఉత్తమమైన జీవనాన్ని ఇస్తుంది 🌴

సేకరణ

No comments:

Post a Comment