Wednesday, June 8, 2022

షడ్రుచులు.. ⚛️

షడ్రుచులు.. ⚛️


👍🏼ఒకసారి ఓ ఊరి జనం వర్షాల కోసం పూజ చేద్దామని మాంచి ఎండలో బయలుదేరారు..అందరూ మామూలుగా వస్తే ఒకే ఒక్కడు గొడుగుతో వచ్చాడు.
అది విశ్వాసం..!

👍🏼ఓ తండ్రి తన చేతిలోని బిడ్డను అంతెత్తున ఎగరేసినప్పుడు ఆ పాప నవ్వుతూనే ఉంటుంది. ఎందుకని.. ఎగరేసిన నాన్న ఖచ్చితంగా..సురక్షితంగా పట్టుకుంటాడని ఎరుకే..
అది భరోసా..!

👍🏼అసలు రేపు ఉదయం లేస్తామో లేదో తెలియని జీవితాలు..అయినా పెందలకాడే లేవాలని అలారం
ఫిక్స్ చేసుకుంటాం..
అది ఆశ..!

👍🏼రేపు ఎలా ఉంటుందో తెలియక పోయినా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం..
అది నమ్మకం..!

👍🏼పెళ్లి చేసుకున్నోడు సుఖ పడిన దాఖలా లేదని చెబుతాం..వింటాం.. కానీ పెళ్లి చేసుకుంటాం..
అది విధి..!

👍🏼ఒక ఎనభై ఏళ్ల పెద్దాయన చొక్కాపై ఇలా రాసి ఉంది..ఎవరన్నారు నా వయసు ఎనభై అని.. నేను 16.. నా అనుభవం 64..
అది వైఖరి..!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment