Friday, June 24, 2022

ధ్యానం వలన ఏకాగ్రత కుదురుతుంది ! ఏకాగ్రతతో శాంతి వస్తుందా ?

💖💖 "259" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖


"ధ్యానం వలన ఏకాగ్రత కుదురుతుంది ! ఏకాగ్రతతో శాంతి వస్తుందా ?"


"కేవలం ఏకాగ్రత కోసమే అయితే దేన్నైనా ధ్యానించవచ్చు కదా ! మనం అనేక ఆలోచనల్లో ఉన్నందువల్ల అశాంతి వస్తుంది. కాబట్టి ఒకే ఆలోచనలో మనసును నిలిపి శాంతిని పొందాలని ఆరాటపడుతున్నాం. మన బాహ్య జీవనమంతా అనేక ఆలోచనలతోనే ఉంటుంది. అందువల్ల దుఃఖం తప్పటంలేదు. అంతర్ ప్రయాణంలో ఆలోచనలు తగ్గుతాయి. కాబట్టే దాన్ని ఇష్టపడుతున్నాం. అయితే ధ్యానానికి కొలతలు నిర్ణయిస్తే అది లౌకిక విషయంతో సమానమై అశాంతినే ఫలంగా ఇస్తుంది ! మనం జపించే నామం పవిత్రమైనదై ఉండాలి. అప్పుడు ఆ స్మరణవల్ల మన మనసు పవిత్రతను పొందుతుంది. ధ్యానించే రూపం సద్గుణాలను గుర్తుకు తెచ్చేదిగా ఉండాలి. అది ఉత్తమ సందేశాన్ని మనసుకు స్ఫురింపజేసేదై ఉండాలి. మన పూర్వికులు అందించిన దేవతామూర్తులంతా అలాంటి వారే "!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}


సేకరణ

No comments:

Post a Comment