Thursday, July 14, 2022

మంచి మాట... లు(14-07-2022)

 గురు వారం --: 14-07-2022 :--

ఈ రోజు AVB మంచి మాట... లు
నేటి సమాజంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు . అవ‌సరం తీరాక నువ్వెంత అంటారు విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది..అలాగే నీ ఆలోచనలు మంచివైతే ఎక్కడైనా విజయం నీదే అవుతుంది .

నాకు నవ్వుతూ నటించడం రాదు అబద్ధాలతో ఆకట్టు కోవడం అంతకన్నా రాదు...వెంటపడి వెన్ను పోటు పొడవడం రాదు....అవసరమైన అనవసరమైనా ఒకేలా ఉంటాను .

కాలం మన చేతిలో లేదు
కా‌నీ ! మనం చేసే పని మన చేతుల్లో , చేతల్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి . మన గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు మనం వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. మనం బ్రతికి ఉన్నంత కాలం దైన్యం లేకుండా పౌరుషంతో ఆత్మ విశ్వాసంతో
జీవిస్తే జీవితంలో శాంతి లభిస్తుంది .

మెట్లు చూస్తూ ఉండిపొతే పైకి ఎక్కలేము.. ఎదో చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏమి చేయలేము.. పైకి వెళ్లాలంటే మెట్లు ఎక్కవలిసిందే.. ఏదైనా పని పూర్తి అవ్వాలంటే పని చేయవలిసిందే

సేకరణ ✒️ మీ ...AVB* సుబ్బారావు 💐🤝🙏

No comments:

Post a Comment