Monday, July 18, 2022

దైవం నిరంతరంగా మనసులో నిలువటంలేదు, అలా గుర్తులో ఉండాలంటే ఏమి చెయ్యాలి ?

         💖💖 *"283"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

    

*"దైవం నిరంతరంగా మనసులో నిలువటంలేదు, అలా గుర్తులో ఉండాలంటే ఏమి చెయ్యాలి ?"*

**************************


*"నిరంతరం దైవాన్ని గుర్తుకు తెచ్చే తరుణోపాయం మంత్రం. ఆలోచనలు ముసురుకున్న మనసుకు మంత్రం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. అందరిదీ ఒకే మనస్సు. కానీ అనుభవాలే వేర్వేరుగా ఉంటాయి. భూమి ఒక్కటే అయినా అందులో రకరకాల చెట్లు ఎలా పెరుగుతున్నాయో ఇదీ అంతే ! మనసును ఆవహించిన అవలక్షణాలను వదిలించుకోవటానికి భక్తి సులువైన మార్గం. మన అమ్మాయి గురించి ఆలోచన మనం వద్దనుకున్నా గుర్తుకు వస్తూనే ఉంటుంది. కానీ దైవాన్ని ప్రత్యేకించి గుర్తుకు తెచ్చుకోవాల్సి వస్తోంది. మనం కోరుకున్న అనుభవాన్ని ఎప్పుడైనా మనసుపైకి తీర్చుకోగలటం యోగం. అంటే మన ధ్యాస మన ఆధీనంలో ఉండటమే మనం సాధించాల్సిన విషయం. తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ధ్యాస వారిపైనే ఉంటుంది. ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారని తెలిస్తే వద్దనుకున్న భయం ఆవహిస్తూనే ఉంటుంది. ఇదేవిధంగా మనసు భగవత్ చింతనతో నిండి ఉండటాన్ని భక్తి అంటారు. ఈ భక్తి ప్రయత్నంతో వచ్చేది కాదు, శ్రద్ధతో మాత్రమే అలవడుతుంది. భక్తికి లౌకిక విషయాలకు తేడా ఉంది. లౌకిక విషయాలపై ఇష్టం పెరిగేకొద్దీ దుఃఖం పెరుగుతుంది. భక్తి ఎంత పెరిగితే అంత శాంతి లభిస్తుంది !"*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

          

No comments:

Post a Comment