Tuesday, July 5, 2022

తపస్సు-ధ్యానం

 తపస్సు అనగా ఏమి?

* * *

అహంస్వరూపానికై తపించిపోవడం...

అహంకారాన్ని దహించివేయడం...

* * *

తపస్సు, ధ్యానం తేడా  చెప్పగలరు...

* * *

ఇప్పుడిప్పుడే అవసరం లేదన్నట్లుగా...

వాయిదా పద్ధతుల్లో చేసుకునే సాధన ధ్యానం...

అదొక టైంటేబుల్ సాధన...

* * *

మన ఋషులెవరూ ధ్యానం చేయలేదు...

తపస్సు చేశారు...

ధ్యానం బౌద్దుల మాట...

తపస్సు మన సనాతనుల మాట...

* * *

అమ్మ దగ్గర తనకు కావలసిన దానిని సాధించే వరకు బాలుని ఆగని ఏడుపు తపస్సు...

* * *

బిడ్డ తప్పిపోతే...బిడ్డ దొరికే వరకు తల్లి పడే ఆవేదన తపస్సు...

* * *

సమాధానం పొందే వరకు యముడి గడపట్లో భీష్మించికూర్చున్న నచికేతునిది తపస్సు...

* * *

"అగ్రస్థానం" పొందేవరకు పట్టు వదలని ధ్రువునిది తపస్సు...

* * *

మరణభీతి కలిగినప్పుడు...

దానిని అప్పటికప్పుడే తేల్చుకున్న రమణుడిది తపస్సు...

* * *

"ఊపిరి" అంత అవసరంగా ఉన్న "లక్ష్యమే" తపస్సు...

* * *

"సాధన అంటేనే వాయిదా వేయడం"

అంటారు జిడ్డుకృష్ణమూర్తి...

అంటే ఇప్పటికిప్పుడే "పొందటం" నీకిష్టం లేక...

సాధన పేరుతో వాయిదా వేస్తున్నావు...

* * *

ఓ పాముపిల్ల రోడ్డు దాటుతూ...

నా కాళ్లమధ్యలోకి వచ్చేసింది...

దానిని తప్పించుకోవడానికి నేను చేసిన డాన్స్ గుర్తొస్తే...

ఇప్పటికీ నవ్వొస్తుంటుంది...


"పాము నుంచి తప్పించుకోవడం ఎలా?

అనే గ్రంథాన్ని పరిశీలించలేదు...

కనీసం పక్కనే ఉన్న స్నేహితుడిని కూడా సలహా అడగలేదు...


అప్పటికప్పుడే...

తనకు తానే...

తీసుకున్న నిర్ణయమే...

చేసిన ప్రయత్నమే...

తపస్సు.

* * *

ప్రయత్నంలో- 

తీవ్రత ఉన్నప్పుడు దాని పేరు - తపస్సు.

తీవ్రత లేని ప్రయత్నం పేరు - ధ్యానం.

రెండూ ఒకటే...

తీవ్రతే తేడా...

* * * 

No comments:

Post a Comment