Monday, July 11, 2022

కృతజ్ఞత యొక్క శక్తి ➖➖➖✍️

 కృతజ్ఞత యొక్క శక్తి

➖➖➖✍️


ప్రతి మనిషి ‘కృతజ్ఞత’ తో కూడిన వైఖరిని అలవర్చుకోవాలి..

ఎందుకో తెలియాలంటే ఈ చిన్న కథ ను చదవండి…


ఇది కథ కానీ కథ, కానీ ఇది మనందరి కథ!


ఎడారిలో నివసించే ఒక పక్షి ఉంది, అది చాలా అనారోగ్యంతో, ఈకలు అన్ని రాలిపోయి, తినడానికి మరియు త్రాగడానికి ఏమీ లేకుండా, నివసించడానికి ఆశ్రయం లేకుండా ఇలా చెప్పడానికి అలవి లేని బాధలతో, అనారోగ్యంతో, అష్ట దరిద్రాలలో చిక్కుకొని ఉంది.


ఒక రోజు ఒక పావురం అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న జీవితం పై అసంతృప్తి చెందిన ఆ పక్షి పావురాన్ని ఆపి, "మీరు ఎక్కడకి వెళ్తున్నారు?” అని అడిగింది.


అప్పుడు ఆ పావురం, "నేను స్వర్గానికి వెళుతున్నాను" అని బదులిచ్చింది.


వెంటనే జబ్బుపడిన పక్షి, స్వర్గం లో ఉన్న ఆ అనంత శక్తి అయిన భగవంతుడిని ‘దయచేసి నా బాధలు ఎప్పుడు తీరుతాయో, ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడూ బయట పడతానో’ తెలుసుకోండి!" అని వేడుకుంది.


పావురం "ఖచ్చితంగా, నేను ఆ పని చేస్తాను" అని చెప్పి జబ్బుపడిన పక్షికి వీడ్కోలు పలికి స్వర్గానికి బయలుదేరింది.


పావురం స్వర్గానికి చేరుకుంది మరియు జబ్బుపడిన పక్షి సందేశాన్ని ప్రవేశ ద్వారం వద్ద దేవదూతతో పంచుకుంది.


అయితే దేవదూత ఇలా అన్నాడు, "తన జీవితంలో తరువాతి ఏడు సంవత్సరాలు పక్షి ఇలా బాధపడాలి, ఆ పక్షి కి అప్పటి వరకు ఆనందం లేదు."


పావురం, ఆశ్చర్యపోతూ, బాధతో ఇలా అంది…"అనారోగ్య పక్షి ఇది విన్నప్పుడు, ఇంకా నిరాశకు, నిస్పృహకు గురవుతుంది,దాంతో తన జీవితం ఇంకా దుఖః భారతం అవుతుంది కాబట్టి దీనికి మీరు ఏదైనా పరిష్కారం సూచించగలరా?" అని వేడుకుంది.


అప్పుడు దేవదూత, "ఈ మంత్రం పఠించమని ఆ పక్షి కి చెప్పండి!” అని కింద ఉన్న మాటలను ఉపదేశించాడు… "దేవుడా నాకున్న ప్రతిదానికీ నీకు కృతజ్ఞతలు!"

"Thank you God for everything!"


పావురం ఆనందంతో వెంటనే అక్కడ నుంచి బయలుదేరి అనారోగ్య పక్షిని మళ్ళీ కలుసుకుంది. దానికి దేవదూత చెప్పిన మాటలన్నీ చెప్పి ఆ సందేశాన్ని తెలియచేసింది.


ఏడు రోజుల తరువాత పావురం మళ్ళీ అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, పక్షి ని చూసి చాలా ఆశ్చ్యపోయింది. ఆ పక్షి చాలా సంతోషంగా ఉంది, దాని శరీరంపై ఈకలు పెరిగాయి, ఎడారి ప్రాంతంలో ఒక చిన్న మొక్క కూడా పెరిగింది, నీటితో కూడిన ఒక చిన్న చెరువు కూడా ఉంది, పక్షి ఆనీళ్ళల్లో ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా నృత్యం చేస్తోంది. పావురం ఆశ్చర్యపోయింది.


’రాబోయే ఏడు సంవత్సరాలు పక్షికి ఆనందం ఉండదని దేవదూత చెప్పాడు, మరి ఏంటి ఈ పక్షి కి ఏడు రోజులలోనే అన్ని కష్టాలు తీరిపోయాయి!’ అని ఆశ్చర్యపోయి, ఈ ప్రశ్నను దృష్టిలో పెట్టుకుని, పావురం స్వర్గం ద్వారం వద్ద ఉన్న దేవదూతను దర్శించడానికి వెళ్ళింది.


పావురం తన ప్రశ్నను దేవదూత కు చెప్పింది. దానికి దేవదూత బదులిచ్చారు. "అవును, నిజానికి ఆ పక్షికి ఏడు సంవత్సరాలు ఆనందం లేదు, కానీ పక్షి ‘ప్రతిదానికీ దేవునికి కృతజ్ఞతలు!’ అనే మంత్రం పఠిస్తున్నందున, ప్రతి పరిస్థితిలోనూ, దాని జీవితం మారిపోయింది, ఏడు సంవత్సరాలలో అందవలసినది, కృతజ్ఞత యొక్క శక్తి ఏడు రోజులకే అందేలా కుదించినది.


పక్షి వేడి ఇసుక మీద పడిపోయినప్పుడు అది ఇలా చెప్పింది…"దేవుడా ప్రతిదానికీ నీకు కృతజ్ఞతలు"

అది ఎగరలేకపోయినప్పుడు, దాహం వేసినప్పుడు మరియు చుట్టూ నీరు లేనప్పుడు, అది ఇలా చెప్పింది,"దేవుడా ప్రతిదానికీ నీకు కృతజ్ఞతలు"

పరిస్థితి ఏమైనప్పటికీ, పక్షి అనంత విశ్వ శక్తి పైన సంపూర్ణ, పరిపూర్ణ విశ్వాసం ను ఉంచి ఆ పవిత్ర మంత్రాన్ని పునరావృతం చేస్తూనే ఉంది, "దేవుడా ప్రతిదానికీ నీకు కృతజ్ఞతలు"


అందువల్ల ఏడు సంవత్సరాలు లో కరగవలసిన అతని కర్మలు ఏడు రోజులలోనే కరిగిపోయాయి. ఈ కథ విన్నప్పుడు, నా అనుభూతి, ఆలోచించడం, అంగీకరించడం మరియు జీవితాన్ని చూసే విధానంలో విపరీతమైన మార్పును అనుభవించాను.


నేను ఈ మంత్రం ను తెలుకున్న తర్వాత నా జీవితంలోకి దీన్ని స్వీకరించాను.

నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కి, నాకు ఆ అనంత శక్తి ప్రసాదించిన ప్రతీ దానికీ నేను ఈ మంత్రం పఠించడం ప్రారంభించాను.

"THANK YOU GOD FOR EVERYTHING!.”

"ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"


నా అభిప్రాయాన్ని నా జీవితంలో లేనిదానిని మార్చడానికి లేదా కొత్తగా సృష్టించుకొనేందుకు ఇది నాకు ఎంతో సహాయపడింది.

ఉదాహరణకి నాకు తల నొప్పి ఉంటే నా మిగతా శరీరమంతా పూర్తిగా చక్కగా మరియు ఆరోగ్యంగా ఉందని దేవునికి ధన్యవాదాలు చెప్పాను. మరియు నా తలనొప్పి నన్ను అస్సలు బాధించకుండ మాయమావటం నేను గమనించాను.


అదే పద్ధతిలో నేను ఈ మంత్రం తో నా సంబంధాలలో (కుటుంబం, స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు కావచ్చు) ఆర్థిక, సామాజిక జీవితం, వ్యాపారం మరియు నేను సంబంధం ఉన్న ప్రతిదానిలో ఉపయోగించడం ప్రారంభించాను.


నేను ఈ కథను నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో పంచుతున్నాను మరియు దీనివలన చాలామంది కి మేలు జరిగింది.

మీకూ జరు గుతుంది!"THANK YOU GOD FOR EVERYTHING!.”✍️

.


సేకరణ

No comments:

Post a Comment