Wednesday, July 20, 2022

🙏మనిషి ఎప్పుడు ఐదు స్థితులలో ఉంటాడు.🙏

  🙏మనిషి ఎప్పుడు ఐదు స్థితులలో ఉంటాడు.🙏 

 

 సృష్టి-పుట్టడం, స్థితి-బ్రతకడం, లయ-నిద్రించడం లేక మరణించడం, తిలోధార(బంధం), అనుగ్రహ(మోక్షం). మొదటి నాలుగు కొన్ని సంబంధం ఉండి, కొన్ని లేక జరుగుతున్నాయి. కాని చివరిది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.   ఎందుకంటే బంధం అడ్డుతగులుతుంది. ఈ బంధాన్ని దాటి ముందుకు వెళితే పరబ్రహ్మ తత్త్వం తెలుస్తుంది. ఆ తత్త్వమే సర్వం వాసుదేవమయం. అది తెలుసుకోవడమే మోక్షం. ఇవి పొందడం కోసం మనకి ఋషులు ఎందఱో బీజాక్షరాలతో కూడిన శ్లోకాలు, మంత్రాలు మనకి అందించి చదవమన్నారు. ఇవి చదువుతూ ఉంటే వాటి ఫలాలు మనకి అందుతాయి. ఎలాగంటే మానవుడి దారి మోక్షప్రాప్తి. ఆ దారిలోకి అడుగుపెట్టే విధంగా మనం చదివే శ్లోకాలు మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. ఎప్పుడైనా ఒకసారి చదువుతుంటే అది జన్మజన్మలకు ''ఇంతింతై వటుడింతై అన్నట్లు'' మీకు తోడుగా వచ్చి మీలో నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. వారానికో నెలకో చదువుతుంటే ఇంకొంచం త్వరగా మేల్కొంటుంది. అదే నిత్యం చదువుతూ ఉంటే ఇంకా త్వరగా చైతన్యం మేల్కొని జన్మలు తరిగిపోయి మోక్షప్రాప్తికి సుగమం ఏర్పడుతుంది. అంటే మనం చదివే విధానాన్ని బట్టి మనలో ఉన్న చైతన్యం మేల్కొంటుంది. ఇవి చదవాలి అంటే మనలో దీక్ష, పట్టుదల ఉండాలి. ఒకరోజు , రెండు రోజులు, వారం రోజులు చదివి వదిలేయకూడదు. మొదట్లో కొంచం కష్టం అనిపిస్తుంది. కాని నిరంతర సాధన చేయగా చేయగా మనదేహం అలవాటు పడుతుంది. మధ్యలో కలిపురుషుడి వలన ఎన్నో అడ్డంకులు కూడా తగులుతాయి. అవి ఇంట్లో ఉండవచ్చు, బయటి నుండి రావచ్చు. ఏది వచ్చినా పట్టుదలతో ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా యిట్టె తొలగించవచ్చు. 

 

 ఐతే మనలో ఎన్నో విషయాలకి లొంగిపోయే గుణాలు ఉంటాయి. కలి ముందుగా వాటినే చూస్తాడు. ఎందులో ఐతే తొందరగా పడి వెళ్ళే దారి నుండి పక్కకి తప్పుకుంటావో చూసి వాటి మీద దృష్టి కేంద్రీకరించి నీ దృష్టిని ఆ మార్గం నుండి తప్పిస్తాడు. భార్య రూపంలో, తల్లిదండ్రి రూపంలో, బిడ్డల రూపంలో, ఉద్యోగ-వ్యాపార, స్నేహ, బంధు రూపంలో ఇది అది అని కాకుండా ఎలాగైనా రావచ్చు, అన్నిటికి ఎదిరించి నిలబడాలి. అప్పుడే విజయం సాధిస్తారు. అమ్మయిల కోసమో, ఆస్తుల కోసమో, ఉద్యోగ-వ్యాపార, స్నేహం కోసమో లేక మరే ఇతర వస్తువుల కోసమో తెగించడం అంటే అది బంధంలో నిన్ను నువ్వు ఇరికించుకోవడం తప్ప మరొకటికాదు. ఇక్కడ ఒక సందేహం వస్తుంది అందరికి. ఇలా మోక్షం మోక్షం అంటూ తిరిగితే సంపాదన ఎలా? అని పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఒక్కటే. 


 నువ్వు నమ్మింది బంధు మిత్ర, సపరివారం కాదు. దైవాన్ని నమ్ముకున్నావు. ఎలాంటి సమస్య గాని, ఆర్థిక పరమైన ఇబ్బందులు గాని రావు. నేనే ఇందుకు సాక్ష్యం. నా జీవితంలో అనుకోని ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. జరుగుతున్నాయి.  


సేకరణ 

No comments:

Post a Comment