Tuesday, July 26, 2022

మంత్రం, దేహభావన, సమాధి, స్పిరిచ్యువాలిటీ సమన్వయం ఏమిటి ?

 💖💖💖

       💖💖 *"289"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     

*"మంత్రం, దేహభావన, సమాధి, స్పిరిచ్యువాలిటీ సమన్వయం ఏమిటి ?"*

**************************


*"శరీరాన్ని దాటి వెళ్ళటం సమాధి కాదు. శరీర భావనను దాటటం సమాధి ! ప్రాణ స్వరూపులమైన మనకు నిజానికి ఏదీ అవసరంలేదని, అవసరాలన్నీ దేహానివేనని అర్థం కావడమే దేహభావనను దాటటం అంటే. ఆ ప్రాణ భావనలో కర్మలు ఆవిరైపోతాయి. స్పిరిట్ సీసా మూతతీస్తే అది ఎలా ఆవిరైపోతుందో అలా మనకర్మలు ఆత్మభావనలో ఆవిరైపోతాయి. అందుకే ఆత్మను స్పిరిట్ అంటారు. ఆధ్యాత్మికత అంటే స్పిరిట్ లోని రిచ్యుయల్ కనుకనే అది స్పిరిచ్యుయల్ అయ్యింది. మనసు నామజపంలో లీనమైనప్పుడు ఆ మంత్రం, మనం చదవడం లేదని, కేవలం అది మనకు వినపడుతుందని తెలుస్తుంది ! ఆ తర్వాత అది వినపడటం కూడా కేవలం కలలోలాగా భావనేకానీ సత్యం కాదని తెలుస్తుంది. మనలో శబ్దంలేని వినికిడి, రూపమేలేని దృశ్యం జరుగుతున్నాయని సాధనలో దశలవారీగా అనుభవంలోకి వస్తుంది. సత్యావలంబనమే సమాధి. అంటే ఎల్లప్పుడూ లోపలి చైతన్యంతో మనసు కలిసి ఉండటమే సమాధి @ మనసును భక్తి ఆవహించటమే సమాధి !"*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

             🌼💖🌼💖🌼

                   🌼🕉🌼

           

No comments:

Post a Comment