Monday, July 11, 2022

కర్మే బ్రహ్మ

 🪷🪷 "34" 🪷🪷

🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷

కర్మే బ్రహ్మ

"బ్రహ్మ మనం చేసిన అనేకానేక కర్మల్లోంచి వేటిని వేరుచేసి అనుభవానికి నిర్ణయిస్తాడో అదే రాత. వాటిని అనుభవానికి ఇచ్చేదే శరీరం. అది మనిషి శరీరం కావచ్చు లేదా జంతు శరీరం కావచ్చు. మనకి ఏ శరీరం లభిస్తుంది అన్నది మన అనుభవానికి వచ్చిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది."

"పురుషుడు, స్త్రీ, నపుంసకుడు ఇలా ప్రారబ్ద కర్మానుభవాన్ని బట్టి జీవాత్మకి ఆయా శరీరాలు లభిస్తూంటాయి. పూర్వ జన్మలోని పురుషుడు ఇప్పుడు స్త్రీగా కాని, నపుంసకుడుగా కాని అనుభవించాల్సిన కర్మని బట్టి అలా పుట్టచ్చును."

"నైవ స్త్రీన వుమానేష నైవ చాయం నపుంసకః యద్యచ్ఛరీరమాదత్తే తేన తేన స యుజ్యతే"

భావం:-

"ఈ ఆత్మ పురుషుడు కాని, స్త్రీ కాని, నపుంసకుడు కాని, ఇలా 'ఏ ఏ శరీరాల్లో ప్రవేశిస్తే ఆయా ఆకారాలతో ప్రకాశిస్తూంటుంది."

"ఒకే రకం రోగం అనేక మందికి వస్తే అది అందరికీ ఒకే మందుతో సమానంగా నివారణ అవుతోందా? లేదు. కారణం? డాక్టర్లు చెప్పే కారణం - 'వాళ్ళు రెస్పాండ్ కాలేదు..' తమ ప్రాణాలు పోతాయని తెలిస్తే ఎవరైనా ఎందుకు రెస్పాండ్ కారు? ధనవంతులైన కొందరు రోగులకి ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ లో మేలురకం వైద్యం జరిగినా వారు మరణిస్తున్నారు. ధర్మాసుపత్రులలో కొందరు బీద రోగులకి జరిగే నాసిరకం వైద్యంతో వారి అదే రకం రోగం మాయం అవుతోంది. అంటే వైద్యుల, రోగుల చేతిలో లేని బలమైనదేదో మరో శక్తి చేతుల్లో ఉన్నట్లే కదా. ఆ శక్తే కర్మ."

"ఏ హాస్పిటల్ కి వెళ్ళి ఓ ఏడాది స్టాటిస్టిక్స్ పరిశీలించి చూసినా, కొందరు రోగులు పూర్తి చికిత్సతో రోగాలు తగ్గి హాయిగా బయటకి వెళ్తే, మరి కొందరు అదే రకం రోగాలకి అవే మందులు వాడినా తగ్గకుండానే వెళ్తున్నారు అని తెలుస్తుంది - ఒకోసారి పైకే. ఎవరి కర్మ ప్రకారం రోగం తగ్గాలో, చికిత్స పొందాక వారికి రోగం తగ్గుతుంది. లేని వారికి లేదు. అందుకు తగ్గ పరిస్థితులని వారు చేసుకున్న కర్మే సృష్టిస్తుంది. అన్నిటికీ మన కర్మే బ్రహ్మ అయి మన తల రాతని రాస్తుంది. ఇలాగే కొందరికి వచ్చే కొన్ని రకాల గడ్డు సమస్యలు తేలిగ్గా పరిష్కరింపబడితే, ఇంకొందరికి సరిగ్గా అలాంటి తేలికపాటి సమస్యలు పరిష్కరింపబడక పోడానికి కూడా ప్రారబ్ద కర్మే కారణం."

శాపం సత్వర ఫలాన్ని ఇస్తుంది

"శాపం తగలడం అనేది నిజం అని ఈ కింది సంఘటన ఋజువు చేస్తోంది. ఇది మాతృవాణి ఇంగ్లీష్ పత్రికలో షామ్ భట్ అనే అతను తన స్వానుభవాన్ని ఇలా రాసాడు."

"షామ్ భట్ అనే బి.ఏ విద్యార్థి పుత్తూరు వివేకానంద కాలేజ్ లో చదువుతూండగా ఆ కాలేజి ప్రిన్సిపాల్ అయిన ప్రొఫెసర్ యం ఎస్ అప్పాతో కాలేజీ మేగజైన్ విషయంలో పోట్లాట వచ్చింది. ఆవేశంలో అప్పా ఎదుటే ఆ మేగజైన్ని ముక్కలు ముక్కలుగా చింపిపారేసాడు. అతను కాలేజీ చదువు పూర్తయ్యాక ఏ పని ఆరంభించినా దాన్నించి సరైన ఫలాలు అందడం లేదు."

"ఓరోజు షామ్ భట్ మాతా ఆమృతానందమయి దగ్గరకి తనకి కలిగే అపజయాల గురించి చెప్పుకోడానికి వెళ్ళాడు. ఆవిడ అతనేం మాట్లాడకుండానే కాలేజీలో జరిగిన సంఘటనని గుర్తు చేసి, అతనికి గురు శాపం తగిలిందని, ఆయన్ని కలిసి తను చేసిన అపరాధానికి క్షమాపణ వేడుకోమని సలహా చెప్పింది. రెండు రోజుల తర్వాత షామ్ భట్ తన ప్రొఫెసర్ యం ఎస్ అప్పా ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఇతన్ని చూడగానే గుర్తు పట్టాడు. షామ్ భట్ తను ఆనాడు చేసిన పనికి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడానికి వచ్చానని చెప్పగానే అప్పాకి అతని మీద కోపం పోయింది."

“ఇన్ని రోజులు నిన్ను తలచుకుని తిట్టుకోని రోజు లేదు. ఇప్పుడు నీ మీద నాకు కోపం పోయింది.” చెప్పాడు ప్రొఫెసర్. ఆ తర్వాత షామ్ భట్ కి సంపాదనలో లోపం లేకుండా పోయింది."

"ఎదుటివారిలో మన మీద కోపం నిలిచిపోయేంత లోతుగా మనం ఎవర్నయినా బాధించి ఉంటే, వారి మనసులోని బాధ ప్రకంపనలు మనల్ని వచ్చే జన్మలో వెంటాడి తాకుతాయి. ఒకోసారి ఈ జన్మలోనే అవి వచ్చి తాకచ్చు. కాబట్టి మనం అందులోంచి విడుదలవాలి అని అనుకుంటే మాత్రం, అవకాశం ఉంటే మనం మనస్థాపం కలిగించిన వారందరి దగ్గరకి వెళ్ళి క్షమాపణ చెప్పడం విజ్ఞత అవుతుంది."
🌼🪷🌼🪷🌼
🌼🕉🌼

సేకరణ

No comments:

Post a Comment