Monday, July 11, 2022

మానవుని స్థితిలు...!!

 *మానవుని స్థితిలు...!!*

ఎన్నో జన్మల సుకృతం ఫలంగా మానవజన్మ లభించింది, పరమాత్మ వైపుకు తిరిగిన మనోబుద్ధులున్నాయి...

మోక్షాన్ని పొందాలనే కోరికా ఉన్నది, దానికి మార్గాన్ని చూపే గురువూ లభించాడు, ఆ గురువు వద్ద కొంతకాలం శాస్త్రాన్ని విన్నారు...

కాని ఆ శాస్త్రం చూపిన మార్గంలో ప్రయాణం చెయ్యటానికి ఒళ్ళు బద్ధకం, ప్రాపంచిక విషయభోగాల మీద వ్యామోహం, స్వార్థ బుద్ధి, అట్టివాడి స్థితి ఏమిటి???...


వేడి వేడి అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, ఊరగాయ, స్వీటు, హాటు, నెయ్యి, పెరుగు అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి...

బాగా ఆకలితో ఉన్నవాడు వెంటనే వాటిని ఒక ఆకు లో పెట్టుకొని కలుపుకొని తింటే ఆకలి తీరుతుంది గాని.. 

ఆ పనిచేయకుండా అలా కలుపుకు తినే ఓపిక లేక, ఆకలి ఆకలి అంటూ ఇల్లంతా కలియ తిరిగితేనో, బజార్ల వెంట తిరిగితేనో ఏం ప్రయోజనం.. 

ఆకలి తీరుతుందా.. అట్టి వాణ్ణి ఏమంటాం.. మూర్ఖుడు అనమా!!...


ఈ ప్రపంచంలో వస్తువులను, భోగాలను చూస్తూ, వాటిపై వ్యామోహాన్ని (మమకారం) పెంచుకోవటం విషయాసక్తి అలవాటు కారణంగా, ...


ఎంత శాస్త్రాన్ని విన్నా తన నిజస్వరూపం ఆత్మ అనే సత్యాన్ని మరచి శరీరమనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది, జీవుడిగా వ్యవహరించటం (అహంకారం) వల్ల, సాధనల పట్ల అలసత్వం, సోమరితనం...

ఇవ్వన్ని శాస్త్రం చూపిన మార్గంలో ప్రయాణం చెయ్యనటువంటివాడి స్థితి 

No comments:

Post a Comment