Tuesday, July 26, 2022

సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ సమాధి, కుండలినీశక్తి అనేవాటికీ మనసుకు సంబంధం ఉన్నదా ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"290"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖              


*"సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ సమాధి, కుండలినీశక్తి అనేవాటికీ మనసుకు సంబంధం ఉన్నదా ? "*

**************************


*"మన శరీరం అంతా వ్యాపించివున్న మనసునే యోగంలో కుండలిని అన్నారు. మనసును తెలుసుకోవటమే సాధనలోని ప్రధానాంశం. పరిపరి విధాలుగా వెళ్ళే మనసును దైవంపైకి ప్రయత్నపూర్వకంగా లగ్నంచేసే ప్రయత్నం సవికల్పసమాధి. మనసులోని ఆలోచనలను తగ్గించేందుకు మనంచేసే నామజపం సవికల్పసమాధి అవుతుంది. దైవచింతనలో దేహాన్ని, ప్రపంచాన్ని మరిచి ఉండటం నిర్వికల్పసమాధి. ఏ చింతన లేకుండా దేహాన్ని, ప్రపంచాన్ని మర్చిపోవటమే నిద్ర. నిరంతరం చైతన్యభావనతో ఉంటూనే ఈ ప్రపంచంలో జీవనం సాగించటం సహజసమాధి. ఇక భక్తిలో మనసుపొందే తాదాత్మ్యతనే యోగంలో ఊర్ధ్వముఖమైన కుండలినిగా చెపుతారు. కుండలినిశక్తిని 'చుట్టుకొనివున్న పాము'తో పోలుస్తారు. మనం పాముతోకను కదిలించినా, తలను కదిలించినా అది బుసకొడుతుంది. అలాగే మనలోని చైతన్య స్రవంతి శరీరమంతా ఒకే విధంగా వ్యాపించి ఉంది "!*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼

          

No comments:

Post a Comment