అహంకారాన్ని పక్కకు పెట్టాలి
➖➖
*మనలో ప్రేమ, స్ఫూర్తి లేనిదే దివ్యానుగ్రహమునకు మనం నోచుకోలేము.*
*మనకు మనం హృదయంలో నుంచి వచ్చిన భావనతో భగవంతుని సేవ ఒనర్చితే మనల్ని ఏదీ అడ్డుకోలేదు.*
*’నేను’ను ప్రక్కన పెట్టి ఏ పని చేసినా దానికి తిరుగులేదు.*
*మనలో దయార్ధ్రత, భక్తి భావన ఉంటే మన ప్రయత్నంలో విజయం తప్పక చేకూరుతుంది.*
*ఆధ్యాత్మికత నిగూఢ రహస్యాలను వెలికితీస్తుంది.*
*అది కేవలం మత గురువులకి, బోధకులకి మాత్రమే కాదు, అణకువ, సహనం, నిస్వార్థత కలిగిన భక్తులకు కూడా అన్వయిస్తుంది.*
*మనలో ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే తప్ప ప్రాపంచిక కష్టాలను ఎదుర్కొనలేము.*
*అందు వలన జ్ఞాన కవచం ధరించి మనల్ని మనం కాపాడుకోవాలి. అది శాశ్వతంగా కాపాడుతుంది, సదా నిలిచి ఉంటుంది.
No comments:
Post a Comment