Wednesday, July 20, 2022

ఆయుషు నిర్ణయం

 🙏🕉🙏.               .......  *"శ్రీ"*

        🪷🪷 *"43"* 🪷🪷

🪷🪷 *"కర్మ - జన్మ"* 🪷🪷🪷

 *ఆయుషు నిర్ణయం* 

***********************

 *"ఓ ఉయ్యాలలో ఓ పాపని పడుక్కోబెట్టి బలంగా ఊపితే ఆ ఊపు బలాన్ని బట్టి ఎన్ని సార్లు ఆ ఉయ్యాల ఊగాల్సి ఉందో అన్ని సార్లూ అది ఊగాల్సిందే. దాన్ని మధ్యలో ఆపగల శక్తి ఉయ్యాలలోని పసి పాపకి లేదు. ఉయ్యాల - జీవితం,  ఉయ్యాలలోని పసిపాప - పుట్టిన మనిషి , ఊపు - ప్రారబ్ధ కర్మలు. ఓ సారి కొన్ని ప్రారబ్ధ కర్మలతో పుట్టాక వాటిని తొలగించే శక్తి వాటితో పుట్టిన ఎవరికీ ఉండదు అని ఈ పోలికతో చెప్పచ్చు. మనం చేసిన పాప, పుణ్య కర్మలకి ఆనుగుణంగా ఈ జన్మని ఎత్తాం. మన ప్రారబ్ధ కర్మలన్నీ అంతం అయేదాకా అంటే, ఉయ్యాల ఊగే బలం తగ్గేదాకా పాప ఊగినట్లుగా మనం వాటిని అనుభవిస్తూ జీవించాల్సిందే."*

 *"గడియారానికి కీ ఇస్తే, స్ప్రింగ్ చుట్టుకుని, మరలా ఆ కీ శక్తి అయిపోగానే గడియారం తిరగడం ఆగిపోయినట్లుగా, మనిషి ప్రారబ్ద కర్మలన్నీ అనుభవించి ఇంక కర్మలు మిగిలి లేనప్పుడు మనిషి ప్రాణాలు పోయి దేహం పడిపోతుంది."*

 *స్వకర్మ వశతః సర్వ జంతూనాం ప్రభవాప్యయౌః* *తమ తమ కర్మలని అనుసరించి సకల ప్రాణుల చావు పుట్టుకలు ఉంటాయి."*

            *కర్మ-మరణం* 

 *"నిరుక్తం అనే వేదనిఘంటువులో యాస్కుడు ప్రపంచంలోని సర్వ వస్తువులకు ఆరు స్థితులుంటాయని చెప్పాడు. అవి..."*


1. *జాయతే* = *పుట్టడం (శిశువు)*
2. *అస్తి* = *అనుభవంలో వుండటం (కనిపించడం)*
3. *వర్ధతే* = *పెరగడం*
4. *విపరిణమతే* = *మార్పుని పొందడం (గడ్డం మీసాలు, ముడతలు)*
5. *అపక్షీయతే* = *క్షీణించడం (బట్టతల, చెముడు, దృష్టిదోషం)*
6. *నశ్యతి* = 
*నశించడం (కనిపించక పోవడం)*

 *"దీన్ని బట్టి మనిషితో సహా కనిపించకపోవడం లేదా మరణం లేని వస్తువు ఈ భూతలంలో లేనే లేదు అని తెలుస్తోంది."*

 *ధృవం హ్యకాలే మరణం న విద్యతేః* -  *కాలం తీరనిదే చావు రాదు."*

 *"ఇక్కడ కాలం అంటే ఆయుష్షు అని కాక ప్రారబ్ద కర్మలని భావం. కర్మ ఫలానికి, జీవి ఆయుష్షుకి దగ్గర సంబంధం ఉంది. ఆయువు అంటే ప్రారబ్దాన్ని అనుసరించి ఈ శరీరంతో సుఖ దుఃఖ కర్మ ఫలాలన్నిటిని అనుభవించడానికి సరిపడే కాలమే. కొందరు వృద్ధులుగా మరణిస్తే కొందరు బాల్యంలోనే మరణిస్తారు. కాని వారంతా సరైన వయసులోనే మరణించినట్లు."* 

 *"కర్మ సిద్ధాంతం ప్రకారం అకాల మృత్యువు అన్నదే లేదు. ఈ జన్మలో తీర్చుకోవాల్సిన ప్రారబ్ద కర్మలు ఎక్కువ ఉన్నవారు వృద్ధాప్యంలో, తక్కువ ఉన్నవారు బాల్యంలో మరణిస్తారు. మరణించాక మళ్ళీ మిగిలిన కర్మలని అనుభవించడానికి తిరిగి పుడతారు."*

 
*"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ* 
*తస్మాదపరిహార్యేథ్రో న త్వం శోచితుమర్హసి"*
                                   - గీత 2-27

 *భావం:-* 

***********

 *"పుట్టినవానికి మరణం తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యాలైన ఈ విషయంలో నువ్వు శోకించ తగదు. ప్రతీ జీవి జీవితంలోని మృత్యువు ఆఖరి ప్రారబ్ద కర్మ అవుతుంది. ప్రారబ్ద కర్మలన్నీ తీరాకే, ఈ పాంచభౌతిక శరీరాన్నించి జీవాత్మని మృత్యువు విడదీస్తుంది."*

 *"మరణించాక యమ యాతనలు అనుభవించకుండా ఉండటానికి ఓ మహాత్ముడు ఇచ్చిన సలహా ఇది."*

*"కర్మణా మనసా వాచా సర్వ వనెను సర్వదా |* 
*పరపీడాం న కుర్వంతి న తే యాంతి యమాలయం ||"* 

 *భావం:-* 

**********

*"ఆలోచన ద్వారా, మాట ద్వారా, కర్మ (పని) ద్వారా ఎవరైతే ఎప్పుడూ పరప్రాణులకి కష్టాన్ని కలిగించరో, అట్టి వారు ఎప్పుడూ యమయాతనలు అనుభవించరు."*


No comments:

Post a Comment