Friday, July 15, 2022

నీలోనే అన్నీ ఉన్నాయి

 నీలోనే అన్నీ ఉన్నాయి

             


  *నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి. 


  *నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది అని వెతకకు, అది నీ అంతరంగంలోనే అంతర్యామి అయిన అంతరాత్మలోనే ఉంటుంది. 


  *సంతోషానిచ్చేది సంపదలు, అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే. 


  *నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు. 


  *మన సమస్యలకు, మన దుఃఖాలకు, మన బాధలకు పరిష్కారాలు మన దగ్గరే ఉంటాయి, కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము. 


  *సంతోషం అనేది ఎంతో మధురమైనది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి. 


  *విజయం సాధించడంలో ఎవరూ నిన్ను మోసము చేయలేరు - నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్ప. 


  *నీలో ఉన్న శక్తిని నీవు తెలుసుకున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో. 


  *నిన్ను నీవు విమర్శించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది. 


  *నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో. 


  *నిన్ను నీవు మోసగించుకున్నంతగా , ఇంకొకరెవరూ నిన్ను మోసగించరు. 


  *దేనినైనా ఆశించబోయే ముందు అందుకు కావలసిన అర్హతను సంపాదించుకో – తనను తాను జయించుకోగల వ్యక్తి అన్నింటిని జయించగలడు. 


  *దీపము తానూ వెలుగుతూ ఉంటేనే మరో దీపాన్ని వెలిగించ గలదు. 


  *నీమీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు, నీ సమర్ధత కూడా పెరుగతుంది. 


  *అనుభవం నుంచి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. 





No comments:

Post a Comment