Sunday, July 3, 2022

🌹నేటి ఆత్మ విచారం. 🌹నీ సహాజ స్థితి ఆనందమే.

🌹నేటి ఆత్మ విచారం. 🌹

పరమపూజ్య శ్రీ పాండురంగ శాస్త్రి గారి ప్రేరణతో...👏

మానవత్వం సముద్రం వంటిది. సముద్రంలో కొన్ని నీటిబిందువులు మురికిగా ఉన్నంతమాత్రాన సముద్రమంత మురికిగా ఉందనుకోవడం అవివేకం.

మానవత్వన్నీ వదులుకోకుండా కడదాకా కొనసాగించడం వివేకవంతుని లక్షణం. పరమాత్మకు నీవు ఎంతదూరములో ఉంటే... పరమాత్మా నీకు అంతదూరంలో ఉంటాడు.

ప్రశాంతతని ఎలా ఏర్పరుచుకోవాలి అనే విషయాన్ని నీవు తెలుసుకుంటే... నీకో చిన్న గది చాలు. బుక్కెడు అన్నం ముద్దచాలు,కొన్ని బట్టలు చాలు.నీమనుసులో పరమాత్మా పట్ల పరిపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంటే చాలు.

నీ సహాజ స్థితి ఆనందమే. దానిని కావాలని కోరుకోవడంలో తప్పేమీలేదు కానీ, అదిబయట ఎక్కడో ఉందనుకోవడమే తప్పు. అది ఎక్కడో లేదు నీలోనే ఉంది. అది గ్రహించడమే జ్ఞానవంతుల లక్షణం.

పరమాత్మా అనుగ్రహం ఎప్పుడు నిండుగా ఉంటుంది. దానిని పొందాలంటే నిరంతరం ప్రభుకార్యం చేయడం,ఆపేక్షలేకుండా కర్మలను ఆచరించడం.సర్వవేళలలో ప్రభునామాన్ని స్మరించడం చేయాలి.

మన జీవితంలో అనివార్యమైనా, నిశ్చయమైన,ఏకైక ఘటన మృత్యువు. దానిని గుర్తించి మరణించేవరకు సర్వజీవులపట్ల సంయమనంతో, విచక్షణతో మెలగాలి.

జీవితంలో వ్యతిరేక పరిస్థితులు ఎంతటి వారికైనా తప్పవు. అన్నీ పరమాత్మా నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి అని యెరిగి నీ భారాన్ని పరమాత్మా మీద పరిపూర్ణ విశ్వాసంతో వేసి ప్రయత్నించు. అన్నీ ఆ కరుణాంతరంగుడు తప్పకుండ నీ మొర ఆలకిస్తాడు ఇందులో ఎలాంటి సందేహం వలదు.

మన మనుసులో తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండొచ్చు, ఒక్కోసారి జీవితం నుండి పారిపోయేవిదంగా ఉండొచ్చు, నిజానికి అవన్నీ పేక మేడలే వాటికీ బలమైన పునాది అంటూ ఏమి లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి నుండి దృష్టి మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోతాయ్ అధైర్యపడవద్దు నీతో ప్రభు ఉన్నాడు. నీ సుఖదుఃఖాలలో నీతోనే ఉంటూ పాలుపంచుకుంటున్నారు. నీవు ఒంటరి వాడవు కాదు.💥☝

✡సర్వేజనాః సుఖినోభవంతు.💥👏
☸శుభమ్ భూయాత్.💥

సేకరణ

No comments:

Post a Comment