🙏🕉🙏 ....... *"శ్రీ"*
🪷🪷 *"51"* 🪷🪷
🪷🪷 *"కర్మ - జన్మ"* 🪷🪷🪷
*కలల్లో కర్మ ఫలం 1*
********************
*తత్తు కర్మాన్తరం హన్తి మనోవాక్కాయ సమ్భవమ్!!*
**********
*"మనసుతో, మాటతో, క్రియతో చేయబడ్డ దుష్కర్మలు అవి మనసుతో, మాటతో, క్రియతో చేసే సుకర్మల వల్ల నాశనం అవుతాయి".*
*"మనం చేసే పుణ్య కర్మలతో, గతంలో మనం చేసిన పాప కర్మలు నశిస్తాయి. మనిషి జన్మకి కారణం ఇదే. సుకర్మలు చేసి గతంలో చేసిన దుష్కర్మలని వదిలించుకోవడానికి మనిషి జన్మ ఉత్తమ అవకాశం. కాని మనం అది తప్ప మిగిలినవన్నీ చేస్తూ, కర్మ బంధాలని, జన్మ పరంపరని పెంచుకుంటూ పోతున్నాం."*
*"కొందరు ఏ కర్మకి ఆ కర్మే విడివిడిగా అనుభవించాలని, సుకర్మ దుష్కర్మని రద్దు చేయదని భావిస్తారు. తార్కికంగా ఆలోచిస్తే ఆ వాదన తప్పు. అదే నిజమైతే ఎవరూ ముక్తిని పొందలేరు. ఎందుకంటే వారు చేసిన సర్వ కర్మలు భస్మమయితే తప్ప ముక్తి సాధ్యం కాదు."*
*"అలా కర్మలని అనుభవించడానికి మానవ దేహం తీసుకున్నాక మాయ చేత, ప్రకృతి శాసించే ఇంద్రియాల వల్ల మనిషి మరిన్ని శుభ, అశుభ కర్మలని చేస్తూనే ఉంటాడు."*
*"జన్మ ఎత్తి కర్మలని అనుభవిస్తూ, మళ్ళీ కొత్త కర్మలని ఆ జన్మల్లో చేస్తూంటాం, చేసిన కర్మలని రద్దు చేసుకునే విధానం లేకపోతే, ఇక ఈ చక్రానికి అంతే ఉండదు."*
*"అజ్ఞానంలో గత జన్మల్లో చేసిన వివిధ కర్మలని నాశనం చేసుకుని ముక్తి పొందడానికే ధ్యాన మార్గం అని, అందుకే మానవ జన్మ అని కూడా శాస్త్రం స్పష్టంగా చెప్తోంది."*
*"కాబట్టి మంచి కర్మలు చేస్తే కలిగే పుణ్యం వల్ల పాత దుష్కర్మలు భస్మం అవుతాయి. ముల్లుని ముల్లుతో తీసినట్లుగా సుకర్మ దుష్కర్మని తీసేస్తుంది. *'కర్మ కర్మణా నశ్యతి'* *'కర్మ కర్మతోనే నశిస్తుంది' అనే శృతి వాక్యం అర్ధం ఇదే. మరో ఋషి దాన్ని ఇలా చెప్తున్నాడు."*
*స ఇమం లోకం ప్రభాసయత్యభ్రాన్ముక్త ఇవ చంద్రమా"*
*భావం:-*
*********
*"పూర్వం చేసిన పాపాన్ని ఎవడైతే పుణ్యం ద్వారా అణగదొక్కుతాడో అతడు ఈ లోకానికి నిర్వాణ మార్గం చూపే జ్యోతి అవుతాడు. కారు మబ్బులనించి బయటకు వచ్చిన పూర్ణచంద్రునిలాంటి వాడు అవుతాడు."*
*"సుకర్మని సమర్థిస్తూ శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి ఇలా అన్నారు. 'కొయ్యలోకి పూర్తిగా కొట్టిన మేకును ఉదాహరణగా తీసుకుందాం. మొదట మేకు బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. కొయ్యలో ఎంత దిగిందో తెలీదు."*
*"ఆ మేకుని బయటకి లాగడానికి ఎంత శక్తిని ఉపయోగించాలి? లోపలకి మేకు ఎంత దిగింది అన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అందుకు ఆధారమైనవి మూడు. ఒకటి మేకు నెత్తి మీద ఎన్ని దెబ్బలు కొట్టారు, రెండు ఒకో దెబ్బకి ఎంత శక్తి ఉపయోగించారు, మూడు కొయ్య ఎంత ప్రతిఘటించింది అన్నది."*
*"కాబట్టి మేకుని బయటకి లాగడానికి చేసే ప్రయత్నాలు మేకుని లోపలకి కొట్టిన శక్తి, దాన్ని ప్రతిఘటించిన కొయ్య శక్తిల మీద ఆధారపడి ఉంటాయి."*
*"మేకు ఈ జన్మలో మనకి కలిగిన కష్టం అనుకుంటే, మేకుని కొట్టిన శక్తి గతంలో మనం చేసిన దుష్కర్మలు అనుకుంటే, అవి మనకి ఇప్పుడు కనబడవు.అవి తెలియవు కదా అని మేకుని బయటకి లాగడం విరమించుకుంటామా? లేదు కదా. అది బయటకి వచ్చే దాకా మన శక్తిని ఉపయోగించి లాగుతూనే ఉంటాం."*
*"అలాగే మనం చేసే సుకర్మలన్నీ ముందు రాబోయే కష్టాలనే మేకులని బయటకి లాగడానికి ఉపయోగించే శక్తిగా మారుతుంది. సుకర్మలు చేయడానికి ఇది ముఖ్య సూత్రం. ఇదే కర్మ క్షయ రహస్యం."*
*"కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ వారు ఓ సందర్భంలో చెప్పిన మాటలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి."*
No comments:
Post a Comment