Friday, July 15, 2022

అదృశ్యశక్తి, మనోశక్తి ఈ రెండిటి వైవిధ్యం ఎలా అర్ధం చేసుకోవాలి ? మనసు-విశ్వమనసు

 💖💖💖

💖💖 "280" 💖💖

💖💖 "శ్రీరమణీయం" 💖💖

🌼💖🌼💖🌼💖🌼

🌼💖🕉💖🌼

🌼💖🌼

🌼


"అదృశ్యశక్తి, మనోశక్తి ఈ రెండిటి వైవిధ్యం ఎలా అర్ధం చేసుకోవాలి ?"


మనసు-విశ్వమనసు



"అదృశ్యంగా పనిచేసే శక్తే మనసు. ఈ అదృశ్యశక్తినే సైన్స్ సహజం అంటుంది. ఆ సహజాన్నే మనం 'భగవంతుడని' అంటాం. మనకు మనసు ఉన్నట్లే ఈ విశ్వానికి కూడా ఒక మనసు ఉంది ! ఈ విశ్వమంతా ఒకానొక శక్తి వ్యాపించి ఉంది. విషయాన్ని గ్రహించి దానికి తగ్గ క్రియచేసే ఆశక్తికే మనసని పేరు. ఇది సృష్టి అంతటా ఉంది. వేడి దగ్గరకు వెన్న చేరిస్తే అది కరిగి పోతుంది. ఈ ప్రక్రియలో మంటకు గురించి, వెన్నకు మంట గురించి తెలియదు. కానీ కరిగిపోవడం అనే క్రియమాత్రం జరిగిపోతుంది. మనిషికైతే ఇలా తెలియకుండా ఏక్రియ జరగదు. అంటే మనిషికి తెలిసినట్లుగా ప్రకృతిలో ప్రతిదానికి తెలియటం అనే గుణం ఉండనక్కర్లేదు. కానీ సృష్టిలో మాత్రం తెలియటం అనే క్రియ లేకుండానే తెలివితో నిరంతరం అనేక పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిఏటా ఒకే కాలానికి పూత పూయాలని చెట్టుకు ఎలా తెలుసు ? ఏ కాలానికి ఎక్కడ, ఎంతమోతాదులో వర్షించాలో మేఘాలకు ఎలా తెలుసు ? ఇలా గ్రహించి అదృశ్యంగా పనిచేస్తున్న శక్తే మనసుగా పిలవబడుతుంది !"


"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

🌼💖 🌼💖🌼

🌼🕉🌼



No comments:

Post a Comment