13-07-2022:-శనివారం
ఈ రోజు AVB మంచి మాట..లు🔱శుభోదయం💐🌹🤝🕉️
చూడు మిత్రమా!!
బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే, భాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు,,
జీవితంలో ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకో, ఒకడి జీవితాన్ని ముంచి ఎదిగిన వాడు ఈ దునియాలో సంతోషంగా బతికినట్టు చరిత్రలో ఎక్కడ లేదు, ప్రతి క్షణం నరకం అనుభవించి చస్తాడు ,ఫలితం ఆలస్యం కావొచ్చేమో కానీ ఇది పక్క,,
గడిచిపోయిన గత రోజులే బాగున్నాయి అవి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని అనుకునే లోపు, అబ్బో వద్దు వద్దు గడిచిన గతంలో బాధ పడిన రోజులు కూడా ఉన్నాయి అని గుర్తుకు వస్తుంది, అందుకే మంచి చెడుల కలయికే ఈ జీవిత ప్రయాణం అని,,ముందుకేపోదాం
జీవితంలో ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి, ఎవరికైనా రహస్యాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటె నేటి మిత్రుడే రేపటి శత్రువు కావచ్చు,,
సేకరణ ✍️AVB సుబ్బారావు
No comments:
Post a Comment