❤️ ’స్వామి! బాధ్యతలన్నీ తీరిపోయాయి'
💕 ’మంచిది'
❤️ ’కొడుకులూ, కూతుళ్లు ఎవరి సంసారాలు
వారివి. అందరూ బాగున్నారు!'
💕 ’సంతొషం'
❤️ ’నేను హాయిగా, ప్రశాంతంగా ఉన్నాను, ఒకరి ముందు చెయ్యిచాపనవసరం లేదు. జీవితాంతం దిగులు లేకుండా బ్రతుకుతాను.
💕 ’భేష్ ! చాలా మం..చి..దే...!'
❤️ అధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నాను.
నిత్యమూ పూజలు చేస్తున్నాను. ధార్మిక ప్రవచనాలు వింటున్నాను.
జీవితం సంతోషంగా సాగిపోతున్నది.
అదృష్ట వంతుణ్ణి
అనుకొంటున్నాను స్వామీ !'
🌺 ’నీ అంత పనికిమాలిన జీవితం ఎవ్వరూ గడపకూడదు నువ్వొక వ్యర్థ జీవివి' అన్నారు శ్రీరామతీర్థులు వారు
❤️ ఈ మాట వినగానే అప్పటిదాక మాట్లాడిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
అదేమిటి స్వామీ! అలా అనేసారు' అన్నాడు
💕 అవును నాయనా! నేను అన్నదాంట్లో తప్పేమి లేదు, స్వయం ఉద్ధరణే జీవిత పరమార్ధం అనుకొంటున్నావా? పైగా ధార్మిక ప్రవృత్తికి అలవడుతున్నాను అంటున్నావు, ఆ మాత్రం గ్రహింపు రావడంలేదా ఇప్పుడు నీ వయసెంత?'
❤️ అరవై దాటుతున్నాయి స్వామీ'
💕 ’ఇంతకాలం నీ కోసమే బ్రతికావు, ఈ దశలోనైనా పదిమందికోసం బ్రతుకు'
💕 ’సరిగ్గా అర్థం కాలేదు.’
❤️ తన కోసం మాత్రం బ్రతికేవాడు స్వార్ధపరుడు, తన వారి కోసం బ్రతికేవాడు సగటు మనిషి, పదుగురికోసం బ్రతికేవాడు మహా మనిషి. మన సాటివారు సుభిక్షంగా ఉన్నప్పుడే మనమూ సుఖంగా ఉండగలమని గ్రహించు' అన్నారు శ్రీరామతీర్థులు .
❤️ తత్వం బోధపడింది స్వామీ! మీరు చూపిన మార్గంలోనే నడుస్తాను' అంటూ ఆ వ్యక్తి
పాదాభివందనం చేసి వెళ్లిపోయాడు.
🌺 ”నేను, నాది”కి బదులు 'మనం ' అన్న భావన
పెంపొందాలి. తోటివారి అభ్యున్నతికి పాటుపడడం సమాజాన్ని సేవించడం ద్వారానే పరిపూర్ణత వస్తుందని గ్రహించాలి.
❤️ ’నావరకే' నన్న ఊబిలోంచి బయట పడాలి, అటువంటివాడికి అంతటా పరమేశ్వరుని తత్వం గోచరిస్తుంది. ఆ తత్వం ఆ వ్యక్తిని తరింపజేస్తుంది.
No comments:
Post a Comment