*🧘♂️135-కర్మ - జన్మ🧘♀️*
*వైరాగ్యం:-*
అప్పుడు..
*ఏవం బద్దస్తథా జీవః కర్మనాశే సదాశివః!*
*పాశమద్దస్తథా జీవః పాశముక్తస్సదాశివః!!*
*పాశమద్దస్తథా జీవః పాశముక్తస్సదాశివః!!*
-- స్కందోపనిషత్తు
*భావం:-*
*పొట్టుతో వున్నంతవరకే ఏ విత్తనమైనా మొలిచేది. పొట్టు పోతే ఏ గింజా మొలకెత్తదు. అలాగే అజ్ఞానం వుండే దాకానే జనన మరణాలు వుంటాయి. బ్రహ్మ నిష్ణా, జ్ఞాన విచారాలతో ఆవిద్య తొలగిన జీవుడు ఇక జనన మరణాలని పొందడు. అదే ముక్తి.*
మనం తీర్చాల్సిన కర్మలు వున్నంతకాలం మనం మానవులం. అవన్నీ శేషం లేకుండా తొలగిపోతే మనం జీవనముక్తులం అవుతాం. జీవన ముక్తుడు ప్రారబ్ద కర్మలు నశించేదాకా శరీరధారియై తర్వాత మరణిస్తాడు కాని వెంటనే శరీరం రాలిపోదు.
ఇక మళ్ళీ పుట్టడానికి ఒక్క కర్మా మిగలని జీవన్ముక్తుడు మెలకువతోనే, స్పృహలోనే నిర్భయంగా తన శరీరాన్ని వదలగలడు. కర్మలన్నీ ఖర్చయిన యోగి శరీరం నించి ప్రాణం బయటకి వెళ్ళదు. అతని సహస్రారంలోనే అది కలిసిపోతుంది.
No comments:
Post a Comment