💖💖💖
💖💖 *"303"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రాధమిక సూత్రాలు ఏమిటి ?"*
**************************
*"ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా దైవ నామ జపం చేయాలి. నిరంతరం సత్సంగం లేదా సద్గ్రంథ పఠనం కొనసాగించాలి. విన్న మంచి మాటలను ఆచరించి, సత్శీలంతో జీవించాలి. ఈ సూత్రాలు పాటించకుండా ఎవరు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు ! మనసులో వ్యాపకాలు పెరిగేకొద్దీ దైవ నామ స్మరణ తగ్గిపోతుంది. వంద వ్యాపకాలలో దైవస్మరణ ఒకటైతే దైవ దర్శనం సులభ సాధ్యంకాదు. ఏ వ్యాపకమైనా సంతోషంగానో, దుఖంగానో ముగుస్తుంది. నిజానికి సంతోషం, దుఃఖం క్షణికానుభవాలు. కానీ సంతోషాన్ని కావాలనుకోవటం, దుఃఖాన్ని వద్దనుకోవటంచేత అవి మరింత విస్తృతమై, శాంతిని దూరం చేస్తున్నాయి. ప్రతి పనిలోనూ త్రికరణ శుద్ధి అలవడితే మనసు నిరంతరం వర్తమానంలో ఉంటుంది. అలా ఉన్న మనసుకు ఆశ, కోరిక, సంతోషం, దుఃఖం ఏవైనా క్షణికానుభవాలే అవుతాయి. అందుకే వర్తమానంలో ఉన్న మనసు తన స్వరూపమైన శాంతిని అఖండంగా అనుభవించ గలుగుతుంది. ఆ అఖండ శాంతి కోసమే మనం ఆధ్యాత్మికసాధన చేస్తున్నాం !"*
*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"} *
No comments:
Post a Comment