Saturday, August 13, 2022

నేటి మంచిమాట. నీ పలకరింపుకి ఏ జవాబు రాకపోవడం గొప్ప జవాబు లాంటిది...

 నేటి మంచిమాట.

నీ పలకరింపుకి ఏ జవాబు రాకపోవడం గొప్ప జవాబు లాంటిది...
గుర్తు పెట్టుకో...నువ్వు సరైన మనిషిని సంప్రదించలేదు అని నీకు సులభంగా అర్థం అయ్యే రీతిలో చెప్పిన జవాబు అదని..మిత్రులారా ఆశించింది ఎప్పుడూ రాదు,వచ్చింది అయినా నీకు తగ్గట్టు వాడుకోవడం నేర్చుకో అంతే..

🍁 గౌరవం లేని పలకరింపు,మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్షు నిరుపయోగం, అర్థం చేసుకోలేని బంధం, అలాగే మన అవసరానికి కానరాని స్నేహం కూడా ఉన్నా.. లేకున్నా..ఒకటే..

🥀బంధాలు నిలవాలంటే మనలో క్షమించేగుణంఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవంఉండాలి.. ప్రేమలు స్నేహాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకండాలి.. నలుగురితో కలిసుండాలంటేచిన్న చిరు నవ్వుతో పలకరింపులు ఉండాలి..
ఇందులో ఏది నిర్లక్ష్యంచేసినా బంధంలో బలం లేకుండా పోతుంది..

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:

Post a Comment