Viii. Xii. 1-5. 130822-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
జీవన గమన సమగ్ర సారం!
➖➖➖✍️
జీవి జీవన గమన సమగ్ర సారమే జీవితం. జీవితానికి అర్థం- వారి వారి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది.
ఒక శిష్యుడు తన గురువుగారిని జీవితానికి అర్థం ఏమిటని అడిగాడు.
దానికాయన- ‘జీవితానికి అర్థమేమీ ఉండదు. నీ జీవనగమనంతో దానికొక అర్థాన్ని నువ్వు ఇవ్వగలగాలి. అప్పుడే నీ జీవితానికొక సార్థకత చేకూరుతుంద’న్నారు.
పుట్టుక ద్వారా మనకు లభించిన శరీరం వల్ల ఒక అస్తిత్వం వచ్చింది. ఈ ఉపాధితో మనం జీవనం సాగిస్తాం. ఇతర జీవులకూ ఒక శరీరం, ఒక జీవనం, దానికొక గమనం ఉంటాయి.
ఇతర జీవుల కన్నా మనిషి బుద్ధిజీవి, ఆలోచనాపరుడు. ఈ ఆలోచనా శక్తే అతడికి ఈ జగత్తులో ఒక ఆధిక్యత నిచ్చింది. మనిషి తన జీవితాన్ని అర్థవంతం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం అతడి జీవనగమనమే!
ఈ జీవం ఏదొకరోజు నిర్జీవం కాక తప్పదు, ఏ జీవికైనా. జననానికి, మరణానికి మధ్య విస్తరించేదే జీవితం. జీవితం ఒక వరద ప్రవాహంలాంటిది. వెల్లువ, అనూహ్యమైన వేగం దీని లక్షణం. ఊహించని ఘటనలు మనల్ని ఊక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కొన్ని ఆనంద పరవశుల్ని చేస్తే, కొన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. మరికొన్ని ఆలోచింపచేస్తాయి. ఇంకొన్ని దుఃఖ సముద్రంలో ముంచేస్తాయి. మరి కొన్ని మనల్ని తీవ్రంగా భావావేశానికి గురిచేస్తాయి. మరికొన్ని సంఘటనలు మన జీవితకాలమంతా వేదనకు గురిచేస్తూనే ఉంటాయి. కారణం...? వాటిని సానుకూల పరుచుకునే అవకాశాలు దొరకక, మార్గాలు తోచక. అలా జీవననదీ వరదప్రవాహంలో కొట్టుకు పోతుంటాం. సరిగ్గా ఇక్కడే మన తెలివితేటలు, అనుభవం, ఇంగితం, మానసిక పరిపక్వతలు మనకు మార్గదర్శకత్వం చేయాలి. దాని వల్ల మనసుకు నిదానం, నిలకడ వస్తాయి.
‘ఆపదలు మనిషి ధీరత్వానికి గీటురాయి’ అన్నాడు షేక్స్‌పియర్.
చెట్లు ప్రకృతి ధర్మంగా ఆకులు రాల్చడం, మోడులై మళ్ళీ చిగురించడం, పచ్చదనాన్ని సంతరించుకోవడం ఎంతో సహజం.
చీకటిని వెలుగు, వెలుగును చీకటి అనుసరిస్తాయి. అది ప్రకృతి అమరిక. అలాగే కష్టసుఖాలు జీవనధర్మం. రెంటినీ సమానంగా ఆహ్వానించగల మానసిక సంసిద్ధత మనిషికి కావాలి. లేనప్పుడు వాటిని జ్ఞానం, వివేచన, విచక్షణల ప్రాపుతో సముపార్జించుకోవాలి.
దానికి తపన తప్పనిసరి. అప్పుడే మనిషి జీవితాన్ని అర్థవంతం చేసుకొని ఆనందంగా కొనసాగిస్తాడు. మంచి వారితో స్నేహం, మంచి పుస్తకాలు చదవడం అలవరచుకోవాలి. ఇవి మంచి ఆలోచనలకు దారితీస్తాయి. మన మనస్సును దృఢపరుస్తాయి.
తద్వారా ‘స్థిరచిత్తం’ పొందగలమంటారు పెద్దలు.
అర్థవంతంగా జీవితాన్ని గడపడమంటే పెద్ద వేదాంతార్థాన్ని చూడవలసిన అవసరం లేదు. నిజాయతీగా ఉండటం, కష్టించి పనిచేయడం, బాధ్యతను విస్మరించక తన కుటుంబాన్ని పోషించడం, జీవితంలో చిన్న చిన్న సంతోషాలను అనుభవించడం, ద్వేషభావం లేకుండా ఉండటం. మహానుభావుల విషయంలో ఈ ‘అర్థవంతమైన’ అనే మాట ఎంతో ఘనమైన అర్థాన్ని సంతరించు కుంటుంది.
జాతికి ఓ తాత్వికతను, ప్రామాణికతను విలువలను నేర్పుతుంది. సామాన్యులు గడిపే జీవితమైనా, అసామాన్యులు గడిపే జీవితమైనా నిస్వార్థ చింతన, పారదర్శకత, చిత్తశుద్ధి, మనో నైర్మల్యం, క్రమశిక్షణల సామ్యత ఉంటే- అది అర్థవంతమైన జీవితమే! దానికొక పవిత్రత సమకూరుతుంది.
జీవి జీవన నదీప్రవాహం అనంతప్రవాహంలో యోగం చెందాలి. అదే జీవాత్మ పరమాత్మలో ఏకమవ్వడమంటే. ✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సేకరణ

No comments:
Post a Comment