💖💖 *"304"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"జీవితమంతా సుఖసంతోషాలతో ఉండటమేనా సెటిల్ అవ్వటం అంటే ?"*
**************************
*"జీవితంలో ఉద్యోగం, కారు, ఇల్లు ఉండటం కాదు. ముందు నువ్వు ఉండటం, శాంతిగా ఉండటం. అదే నిజమైన సెటిల్మెంట్ ! మనలోనే, మనతోనే ఉన్న శాంతిని మనసుచేసే అలజడి వల్ల అనుభవించలేక పోతున్నాం. జీవితమంతా సుఖసంతోషాలను కోరుకోవడమే మనలో నెలకొంటున్న అలజడులకు కారణం. జీవితం అంటే మనం ఉండటమేగానీ సుఖం, సౌకర్యాలతో మాత్రమే ఉండటం కాదు. కానీ మన ఉద్దేశ్యంలో సుఖసంతోషాలే జీవితమన్న భావన స్థిరపడి మన జీవన సౌరభాన్ని తెలుసుకోనివ్వటంలేదు. శరీరం పెట్టుకునే నగలకు, మనసుపొందే శాంతికి ఏమిటి సంబంధం ? కానీ మనం అన్ని విషయాల్లోనూ సంబంధాన్ని ఆపాదించుకుంటాం. ఆధ్యాత్మిక సాధనలోనూ అదే జరుగుతోంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment