🌺 గృహస్థుల-భక్తిసాధన 🌺
ఒకప్రక్క నిత్యజీవితపు కష్టనష్టాలు, మరోప్రక్క నేటి
నాగరికత ప్రభావంవల్ల కుటుంబవ్యవస్థలో ఎదురయ్యే
చికాకులు గృహస్థులను క్రుంగదీస్తున్నాయి.
“భగవంతుని మీద మనస్సును నిలపాలంటే
గృహస్థులు ఏకాంతంలో అప్పుడప్పుడు నివసించడం
అవసరం. ఆ ప్రదేశం మనుష్య సంచారానికి దూరంగా
ఉండాలి. అటువంటి ప్రదేశంలో మూడురోజులు గాని,
కనీసం ఒకరోజుగాని ఒంటరిగా ఉండి ఆధ్యాత్మిక సాధన
చెయ్యాలి.”
“ఒకరిద్దరు సంతానం కలిగిన తరువాత భార్వాభర్తలు
ఇద్దరూ అన్నాచెల్లెళ్ళలా మెలగుతూ, ఆత్మనిగ్రహంతో
పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి కావలసిన బలాన్ని
ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్ధించాలి - ఇదే గృహస్థులు
అనుసరించవలసిన మార్గం.”
“పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీరు పడవలో
ఉండకూడదు కదా! అదే విధంగా సాధకుడు సంసారంలో
ఉండవచ్చు కానీ సంసారం అతనిలో ఉండకూడదు.”
“నువ్వు గృహస్థువైనంత మాత్రాన దేవుణ్ణి
పొందలేనేమోనని భయపడవలసిన అవసరం లేదు. నీ
మనస్సును మాత్రం భగవంతుని పై నిలిపితే చాలు. నీవు
ఒక చేతితో సంసారబాధ్యతలను నెరవేరుస్తూ, రెండవ
చేతితో పరమేశ్వరుని పాదాలను పట్టుకొని శరణు వేడాలి.
సంసార విధులను పూర్తిచేసిన తర్వాత రెండు చేతులతో
ఆయన పాదపద్మాలను హృదయానికి హత్తుకోవాలి.”
"తగిన వివేకం, వైరాగ్యం, దృఢమైన భగవద్భక్తి ఉంటే
నీవు సంసారంలో ఉన్నా ఫర్వాలేదు.”
“సర్వం భగవంతునికి సమర్పించి, ఆత్మార్పణం
చేసుకున్నప్పుడు అంతా ఆయన _ ఇష్టప్రకారమే
జరుగుతున్నదని నీవు గ్రహించగలవు.”
“గృహస్థులు కూడ భగవత్సాక్షాత్మారాన్ని
పొందవచ్చు. జనకమహారాజుని అందుకు ఉదాహరణగా
చెప్పవచ్చు. కాని ఒక్కసారిగా మనం ఆయనలాగా
తయారుకాలేము. ఆయన లోకవ్యవహారాలకు దూరంగా,
ఏకాంతంగా ఉండి ఎన్నో సంవత్సరాలు కఠోర సాధన
చేశారు. అందువలన, గృహస్థులు కూడా అప్పుడప్పుడు
ఏకాంత ప్రదేశంలో ఉంటూ భగవంతుని సాక్షాత్మారం కోసం
ఆర్తితో సాధన చేయడం అవసరం.”
“ఏ ఆరాటమూ లేకుండా సంసారంలో
నడుచుకోదలిస్తే ఏకాంతంలో ఎంతోకొంత కాలం భక్తిసాధన
చేయాలి. అక్కడ నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ,
నిర్మలమైన భక్తిని ప్రసాదించమని ప్రార్థించాలి. ఈ
ప్రపంచంలో “నీది అనుకొనదగినది ఏదీలేదనే విషయాన్ని
ఎప్పుడూ. గుర్తు చేసుకుంటూ ఉండు! నీవారనుకొనే
వారందరూ ఎప్పుడో ఒకప్పుడు నిన్ను విడిచిపోయేవారేననీ,
భగవంతుడొక్కడే నీవాదనీ, నీ సర్వస్వమనీ, నీ పెన్నిధి అనీ
భావిస్తూ, 'ఆయనను పొందడం ఎలా? అని ఎల్లప్పుడూ
ఆలోచిస్తూ ఉండు!”
“పనసపండును ఒలవడానికి ముందు చేతులకు
నూనె రాసుకుంటే, ఒలిచేటప్పుడు దాని జిగురు చేతికి
అంటదు కదా! అదే విధంగా భక్తిజ్ఞానాలను రక్షగా
పొందినప్పుడు సిరిసంపదలు, సంసార వ్యామోహం నిన్నాంత
మాత్రమూ బాధించలేవు.”
“అయస్మాంతపు దిక్సూచి ఎల్లప్పుడూ ఉత్తర దిశను
చూపించడంవల్ల ఓడ దారి తప్పిపోకుండా ప్రయాణిస్తుంది.
అలాగే మనిషి హృదయం భగవంతునివైపు త్రిప్పబడి
ఉన్నంతవరకూ అతడు సంసార సాగరంలో దారితప్పకుండా
ముందుకు సాగిపోగలుగుతాడు.”
“ఒక స్తంభాన్ని పట్టుకొని చిన్నపిల్లలు నిర్భయంగా
దానిచుట్టూ గిరగిరా తిరుగుతారు. అలాగే భగవంతునిపై
మనస్సు నిలిపి తన సాంసారిక బాధ్యతలను నెరవేర్చే వ్యక్తికి
ఏ అపాయమూ కలుగదు.”
“పల్లెటూళ్ళలోని యువతులు నాలుగైదు కుండలను
ఒకదానిమీద ఒకటి దొంతరగా తలమీద పెట్టుకొని నీళ్ళు
తెచ్చుకొంటూ దోవలో తమ కష్టసుఖాలు ముచ్చటించు
కొంటారు. అయినా, ఆ కుండలనుండి ఒక్క నీటిచుక్క కూడా
తొణకదు. ధర్మమార్గంలో జీవించేవ్యక్తి కూడా అదే విధంగా
ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ అతడి మనస్సు ధర్మ
మార్గాన్ని తప్పకుండా చూసుకోవాలి. అందుకోసం అతడు
ఎల్లప్పుడూ మెలకువగాను, అప్రమత్తంగానూ ఉండాలి.”
“ధనవంతుల ఇళ్ళలో వారి బిడ్డలను పెంచే దాసి తన
యజమాని బిడ్డను తన సొంతబిడ్డ అని చూసేవారు భ్రమపడే
విధంగా పెంచుతుంది. అయినా ఆ బిడ్డపై తనకు ఏ
అధికారము లేదని ఆమెకు తెలుసు. అలాగే మనం కూడా
మన బిడ్డలకు కేవలం పోషకులుగా మాత్రమే ఉండాలి”
“బిచ్చగాడు ఒక చేతితో తంబూర మీటుతూ, మరొక
చేతితో చిడతలను మోగిస్తూ, నోటితో పాడుతూ తిరుగుతూ
ఉంటాడు. అలాగే సంసారి కూడా ఒకవంక రెండు చేతులతో
సంసారవిధులను నిర్వర్తిస్తూనే, నిండు మనస్సుతో
భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉండాలి.”
"బుద్ధి, హృదయం పూర్తిగా వికసించిన వ్యక్తి
ధన్యజీవి. అతడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా
ప్రశంసనీయంగా ప్రవర్తించగలడు. దైవంపట్ల అతడు
నిర్మలమైన భక్తిభావాన్ని కలిగి ఉంటాడు. లోకవ్యవహారాల
లోను, పండితసభలలోను, వాదప్రతివాదాలలోను అతడు
నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. తల్లిదండ్రులపట్ల విధేయత,
బంధుమిత్రులపట్ల ఆప్యాయత; ఇరుగుపొరుగువారి పట్ల
దయాదాక్షిణ్యాలు; భార్యాబిడ్డలపట్ల అనురాగం
చూపగలిగినటువంటి పురుషుడే నిజమైన ధన్యజీవి.”
☸☸☸☸☸☸☸☸☸☸☸☸

No comments:
Post a Comment