🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ప్రశ్న :- నుదుటన గంధం , కుంకుమ ఎందుకు ధరిస్తారు ?☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
జవాబు :- ముక్కు యొక్క కుడి రంధ్రంలోని నాడిని "పింగళ" అని అంటారు. దీనినే "సూర్యనాడి"
అని కూడా అంటారు. పింగళ నాడికి అధిదేవతగా (అదిదేవత అంటే అధిష్టించియుండు దేవత అని అర్థం) "బ్రహ్మ" వున్నాడు. ముక్కు యొక్క ఎడమ రంధ్రంలోని నాడిని “ఇడ" అని అంటారు.
ఇడ నాడికి అధిదేవతగా “విష్ణువు" వున్నాడు. పింగళ , ఇడ నాడులు పైకి వెళ్ళి కలిసే చోట (రెండు కనుబొమల మధ్య భాగమునందు) "సుషుమ్న” అనే మరో నాడి ఉంటుంది. దీనినే "అగ్నినాడి"
అని కూడా అంటారు. సుషుమ్న నాడికి ఆధిదేవతగా “శివుడు" వున్నాడు. ఈ మూడు నాడులు కలియుటను “త్రివేణి సంగమం" అంటారు. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు కలిసే ఈ చోటునే "త్రికూట స్థానము" అని కూడా అంటారు. ఈ సుషుమ్న నాడిలో భగవంతుడు జ్ఞానరూపంలో
సంచరిస్తూంటాడని భారతీయుల విశ్వాసం. అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంథంతోను , కుంకుమతోను అలంకరిస్తారు. ఇలా అలంకరించడం వలన త్రివేణీ సంగమం సంగతి తెలుసు అనే భావం కూడా గోచరిస్తుంది.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
సేకరణ
No comments:
Post a Comment