Sunday, August 14, 2022

నేటి మంచిమాట. మానసిక సమస్యలు పరిష్కరించు కోకపోతే...

*నేటి మంచిమాట. 

మానసిక సమస్యలు పరిష్కరించు కోకపోతే....* ...
మానసిక అశాంతికి లోనైనా,, మానసిక ఒత్తిడికి గురైన ,మానసికంగా కుంగిపోయినా, ఏదైనా సరే సమస్యలను పరిష్కరించుకో కపోతే, బయటపడడానికి ప్రయత్నించకపోతే వారు ఇంకా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వారికి ఈ సమస్యలే కాకుండా కొత్త సమస్యలు కూడా సృష్టించుకుంటారు.

మానసిక అశాంతిలో ఉన్నవారికి , శరీరం రోగగ్రస్తం అవుతుంది. అశాంతి పెరిగి చివరకు డిప్రెషన్ కు గురై మానసికంగా కుంగిపోయి చివరకు ఏమీ చేయలేని స్థితికి చేరుకుంటారు. 

ఈ స్థితిలో తమతో పాటు తమ కుటుంబంలోని వారికి కూడా అశాంతిని కలుగ చేస్తారు.

అలాంటి అశాంతి నుండి శాంతి పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శాంతి అన్నది బయట దొరికేది కాదు. డబ్బు తో కొనేది కాదు. ఇతరులు ఇచ్చేది కాదు. పూజలు భజనలు చేసినా లభించేది కాదు. శాంతి అన్నది మనసుకు సంబంధించింది. శాంతి కావాలనుకుంటే ఎవరికి వారే ప్రయత్నం చేసుకోవాలి.
ఎవరి మనసును వారే శాంత పరుచుకోవాలి అంతకు తప్ప వేరే మార్గం లేదు.

శాంత పరచాలంటే ఒకటే మార్గం ధ్యానం....శ్వాస మీద ధ్యాస.. ఎక్కువగా ధ్యానం చేస్తే తొందరగా శాంతి వస్తుంది. మనశ్శాంతి పొందిన వారు పై సమస్యల్ని అధిగమించి ఆనందంగా జీవించగలుగుతారు.. మానసిక సమస్యలు పోవాలంటే ధ్యానం చేయవలసిందే., వేరే మార్గం లేదు.

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏 

No comments:

Post a Comment