Friday, August 12, 2022

మానవుని నిజస్వరూపం.....

 మానవుని నిజస్వరూపం.....

నేను ఫలానా వ్యక్తినని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనే విజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి, నీవు నువ్వుగా ఉండటం 'నీ నిజస్వరూపం'. ఆత్మయే చైతన్యంగా మారి 'నేను ఫలానా' అని గిరిగీసుకోవటమే 'అహం'. అంతకు మించి 'అహం' అంటూ ప్రత్యేకంగా లేదు.

విషయాలతో మమేకం చెందకుండా మనసును గమనిస్తే దైవమే మన మనసు, తనువు, ఇంద్రియాలు, ప్రపంచంగా మారిందని అర్ధం అవుతుంది. దీనికి కారణం నువ్వు కాదని తెలుసుకుంటే, కర్తృత్వంపోయి శాంతి వస్తుంది. అదే ఆత్మ విచారణ చెప్పే సులభ సాధన.

మనకి మనసు స్వరూపమే కాదు, దాని క్రియలు కూడా పూర్తిగా తెలియవు. కేవలం ఆలోచనల ద్వారా ఈ శరీర బాహ్యక్రియలు చేయించేది మాత్రమే మనసని అనుకుంటున్నాం. గుండెను నడిపి రక్తప్రసరణ చేయించేదీ మనసే.. మనసు పూర్తి స్వరూపం తెలిస్తేగాని మూలం ఏమిటో తెలుస్తుంది.

నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండే నీ ఉనికే 'నీ నిజస్వరూపం'...

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

No comments:

Post a Comment