ॐశ్రీవేంకటేశాయ నమః
💝 పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం
💖 ~గతజన్మల్లో మనం చేసిన పాపం మన అనుభవంలోకి రోగం రూపములో వస్తుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు ఔతుంది. మన కర్మే, గ్రహాల రూపములో వచ్చి, మనల్ని బాధ పెట్టడమో, సుఖ పెట్టడమో జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకుంటాం మనం.
ఆ గ్రహాలు కూడా మనిషి రూపంలోనో రోగాలరూపంలోనో వచ్చి మనల్ని బాధ పెడుతుంటాయి.
💝 శాస్త్రవచనానికి విరుద్ధమైన ప్రవర్తననే ‘పాపం’అంటాం. ఒక జీవి పట్ల అనుచితముగా ప్రవర్తించడమే పాపం. ఇతరులను తిట్టినా, కొట్టినా, బాధపెట్టినా, మోసంచేసినా పాపమే.
💓 శ్లో|| నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||
💞 ~అనుభవించనిచో కర్మ ఫలం కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ ఎంతటి వాడైనా కర్మ అనుభవించ వలసినదే.
💖 ’అణోరణీయాన్ మహతో మహీయాన్’ అని ‘కఠోపనిషత్’ చెప్పింది. ప్రతి కణంలో వున్నాడు పరమాత్మ. నీలో, నాలో అన్ని రూపాలలో వున్నాడు.
💓 మనకు చేతనైనంతకాలం మనం ఎవరితోనూ సేవలు చేయించుకోవద్దు. తలిదండ్రులు సైతం తమ పిల్లలతో సేవ చేయించుకోవద్దు. అత్తామామలు కోడళ్లతో, అల్లుళ్లతో పని చేయించుకోవడమూ పాపమే.
💞 తలిదండ్రులు పిల్లలనూ, పిల్లలు తలుదండ్రులనూ; అత్తలు కోడళ్లనూ, కోడళ్లు అత్తలనూ ఇలా ప్రతీ మనిషి వీలున్న ప్రతిచోటా దైవస్వరూపులే ఐన సాటిమనిషిని హింసిస్తూ, పైశాచికానందాన్ని పొందుతూ గుళ్లల్లో దైవదర్శనాలకు వెళ్తూ, నోములూ-వ్రతాలూ చేస్తే సరిపోతుందా ?
💓 కార్యాలయాల పనుల్లో సహాయం చేసేందుకు ప్రభుత్వాలు వేతనాలిచ్చి పరిచారకులను నియమిస్తే “అహంకారం తలకెక్కిన కుహనా అధికారులు కొందరు” వారితో తమ గృహాల్లో సొంతపనులు చేయించుకుంటూ ఇబ్బడిముబ్బడిగా పాపాలను మూటగట్టుకుంటున్నారు.
💕 వీళ్ల ఇళ్లల్లో ఒక్కరోజు ఆ పరిచారకులు పాత్రలను శుభ్రపరిస్తే వచ్చే జన్మలో ఆ పరిచారకుల ఇళ్లల్లో వీళ్లు పదిరోజులు పని చేయకతప్పదు. ఈవిషయం తెలుసుకున్న నేను నేను పనిచేసిన చోట నా కుర్చీ కూడా నేనే వేసుకునేవాణ్ణి, నేనే శుభ్రపరుచుకునే వాడిని (చూడలేక పరిచారకుడు పరుగుపరుగున వచ్చేవాడనుకోండి. అది వేరే విషయం) “జాబ్ ఛార్టు”కు భిన్నంగా సొంతపని చేయించుకోడం పాపమనీ, ఆ పాపఫలితాన్ని కూడా అనుభవించక తప్పదని తెలియకపోవడం దురదృష్టకరం.
❤️ గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం గారినిక్కడ మనం స్మరించుకోవాలి. శబరిమలైకి ‘డోలీ’లో వెళ్లిన తాను డోలీలో తనను తీసుకెళ్లినవాళ్లకు తగిన fare చెల్లించి పాదాభివందనాలు చేశాడు. అప్పటినుండీ నేను ఏ క్యాబులో వెళితే ఆ క్యాబతని కాళ్లు మొక్కడంలేదు కానీ fareఇచ్చి ధన్యవాదాలు చెబుతున్నాను.
💞 తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. ఒకరి పట్ల మనమేదైనా తప్పు చేస్తే వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే అది జన్మజన్మలు మనల్ని తరుముతూనే వుంటుంది. మనల్నీ, మన పిల్లల్నీ కూడా వదలదు. తాతలు, ముత్తాతలు చేసిన తప్పులు, ఆ వంశంలోని వారినందరినీ వెంటాడుతూనే వుంటాయి.
💝 జాతకాలు పరిశీలించినప్పడు బయటపడుతుంటాయిలాంటివి.ముఖ్యంగా రాహుకేతు దోషాలు. కొడుక్కు వుంటుంది, కూతురుకి వుంటుంది, భార్యకు, భర్తకు, తల్లికి, తండ్రికి, తాతకు అందరికీ ఒకే విధముగా వుంటున్నది. ఎవరో, ఎప్పుడో ఎక్కడో అహంకారంతో చేసిన చిన్నతప్పు తరతరాలుగా వెంటపడి వస్తూండడాన్ని నేను గత 56 సంవత్సరాల జ్యోతిషానుభవంలో గమనిస్తున్నాను.
💝 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.
💖 ~లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుసరించే ఉంటుంది. సత్యమున్న చోట సంపద ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది.
💓 చేసిన చిన్నతప్పు మహపాపం గా మారకుండా ఉండాలంటే, కుటుంబాన్ని వేధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
💕 ప్రాయశ్చిత్తై రపైత్యేనః……. ప్రాయశ్చిత్తముతో పాపాలు తొలగి పోతాయ. అది పశ్చాత్తాపంతో కూడిన ప్రాయశ్చిత్తమై ఉండాలని పరాశర స్మృతి చెప్పింది.
💞 శ్లో|| ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే, తపోనిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే.
💓 ~ప్రాయాస్ అంటే తపస్సు. చిత్తమంటే నిశ్చయము. నిశ్చయంతో కూడిన తపస్సే ప్రాయశ్చిత్తం.అంటే నీకై నీవు దండన విధించుకోవడం.
💓 ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించినా “పొరబాటైంది అని మన్నింపు కోరాలి.🙏🏻
--సేకరణ
No comments:
Post a Comment