పెద్ద అడ్డు గోడ --- 'అహం'
🙏🌷🙏భగవంతునికి భక్తునికి మధ్య 'అహం' అనేది పెద్ద అడ్డు గోడ వంటిది. దానిని పడగొడితే తప్ప భగవంతుడు కానరాడు.
’మేము ఎన్ని సంవత్సరాలు పూజలు చేసినా భగవంతుడు మాకు అనుగ్రహం చూపడం లేదు!’ అని అనుకుంటూ ఉంటారు.
అయితే మనలో ' నేను, నాది' అనే అహంకారం ఉన్నంత వరకూ ఆయన మనకు చిక్కడు!
చిక్కకపోతే అనుగ్రహము దొరకదు. అనుగ్రహము లేకుంటే ఆనందము కలుగదు.
కనుక 'నాకు అంతా తెలుసు, ఇది నా వల్లనే జరిగింది, నేనే చేశాను' అనే భావన నుండి 'ఇదంతా భగవంతునిదే , ఆయన అనుగ్రహం వల్లనే నేను ఇది పొందగలిగాను, అంతా అయన సంకల్పం మేరకే జరుగుతుంది, నేను కేవలం అయన చేతిలో ఒక పనిముట్టును మాత్రమే! ' అనే సత్యములోకి రావాలి.
అపుడు ‘అహం’ అనే గోడ దానికదే పడిపోయి పరమానంద స్వరూపుడు అయిన పరమేశ్వరుడు కనిపిస్తాడు. తన అనుగ్రహమును పుష్కలంగా మనపై కురిపిస్తాడు.
🙏🌷🙏
సేకరణ
No comments:
Post a Comment