💖💖 "310" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
"ఆత్మానుభవాన్ని గురువు అందిస్తాడా ?"
"ఆత్మానుభవం గురువు బయటి నుండి అందించేది కాదు. మన జీవితమంతా బాహ్యప్రపంచంతోనే సాగుతోంది. బాహ్యంలో మనం కోరుకున్నవన్నీ బయట నుండి లభించేవి. మనం ప్రతి అనుభవానికి బాహ్య వస్తువులపై ఆధారపడటానికి అలవాటుపడ్డాం. ఆత్మానందాన్ని కూడా అదేవిధంగా, దాన్ని గురువు మనకి అందిస్తారనే భ్రమలో ఉంటున్నాం. మనలోనే, మనతోనే ఉన్న వస్తువుకు సంబంధించిన అనుభూతి, ఆనందాన్ని మరొకరు అందించటం సాధ్యం కాదు. గుండె ఆగి పోయిందని ఒక వ్యక్తికి అనుమానం వచ్చింది. వైద్యుడి వద్దకు వెళ్ళాడు. వైద్యుడు పరీక్షించి నీ గుండె బాగానే పనిచేస్తుందని చెప్పాడు. నిజానికి ఆ మనిషి ప్రాణంతో ఉండటమే అతని హృదయ స్పందనకు గుర్తు. అక్కడ వైద్యుడు ఉన్న విషయాన్ని అతనికి తెలిసేలా చేశాడే కానీ క్రొత్తగా అందించింది ఏమిలేదు. అప్పుడు ఆ వ్యక్తి పొందే స్వాంతన బయట వస్తువు నుండి అందేది కాదు. అలాగే మన ఆత్మానుభవం కూడా ! ప్రతి అనుభవం వెనుక తెరలాగా ఉన్న ఆత్మను గురువు గుర్తుకు తెస్తారు. దేవుని విగ్రహాన్ని కన్నుల పండుగగా చూస్తూ తనకు చూపును ప్రసాదించమని అడగటం ఎలాంటిదో గురువు ఆత్మ ఆత్మానుభవాన్ని అందిస్తారు అనుకోవడం కూడా అలాంటిదే ! ఈ ప్రపంచంలో ఆత్మను అనుభవించని వారే లేరని భగవాన్ శ్రీరమణమహర్షి స్పష్టం చేశారు !"
"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"
No comments:
Post a Comment