మిత్రులందరికి ఒక రిక్వెస్ట్.
గత కొద్ది కాలంగా చాలా మంది ప్రముఖులు, మనకు తెలిసిన వారు, మన స్నేహితులు, మన తోటి ఉద్యోగ వ్యపారాలు చేసుకునే వారు హఠాత్తుగా అకాల మరణం పొందడం మనం చూస్తున్నాము.
ముఖ్యంగా 40-60 సంవత్సర నడి వయస్సులో ఉన్నవారు. జీవితంలో peak stage లో ముఖ్యమైన బాధ్యతలు నరవేర్చాల్సిన సమయంలో ఇలా జరుగుతుండడం బాధాకరమైన విషయం.
దీనికి ఒక కారణం unexpected and unknown long term effects of Covid అని కొందరు వైద్య నిపుణుల అభిప్రాయం.
మరొక ముఖ్య కారణం జీవన విధానం లో లోపాలు. ముఖ్యంగా ఈ రెండో కారణంపై దేశంలో ప్రస్తుతం పెద్ద చర్చనే జరిగుతుంది.
షేర్ మార్కెట్ బిలియనీయర్ రాకేష్ జుంజున్ వాలా మరణ కారణంగా, 62 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ఆయన మరణించడం, అయన మరణాన్ని ఆయన దగ్గరవున్న వెలకోట్ల ధనం ఆపలేకపోవడం మన ముందు ఒక గుణపాఠం ల నిలిచింది.
దానికి కారణాలు ఆయనే చెప్పినట్టు 'నియంత్రణ లేని మద్యపానం, ధూమపానం, నియమం లేని ఆహారం, శారీరక వ్యాయామం అసలే లేకపోవడం, మానసిక ఒత్తిడి'. వెరసి ఆయన జీవితం కనీసం 20 ఏళ్ళు తగ్గింది. వెయ్యికోట్లిచ్చినా ఆరోగ్యం, అయుష్షు తిరిగి రావని మనకు చెప్పిన నీతి.
మనందరం కూడా వయస్సు దృష్ట్యా జీవితంలో ఇదే vulnerable period లో ఉన్నాం.
నెరవెర్చల్సిన బాధ్యతలున్నాయి.
మన కుటుంబాలకు మనం చాలా ముఖ్యం.
అందువలన మనందరం మన ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడుదాం. ఆరోగ్యకరమైన జీవన విధానానికి అలవాటు పడుదాం.
దానికి కావల్సిన నాకు తెలిసిన కొన్ని సూచనలు:
1. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకుందాం.
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుంటే అదృష్టవంతులమే. భగవంతుడు ఇచ్చిన ఈ అపురూపమైన వరాన్ని అలాగే కాపాడుకుందాం. దానికి అవసరమైన జీవన విధానాన్ని continue చేద్దాం.
2. మన వయస్సులో BP, Sugar, Cholesterol, overweight లాంటి సమస్యలు రావడం సహజమే.
రెగ్యులర్ మెడికేషన్, సరైన ఆహారం, అవసరమైన exercise తో వీటిని నియంత్రించ వచ్చు. పట్టించుకోకపోవడం ప్రమాదం. అందువలన దానికి అవసరమైన జీవన విధానం సమయానికి ఆహారం, సమయానికి మందులు, regular testing అలవాటు చేసుకుందాం.
3. మన దురదృష్టం కొద్ది అప్పుడప్పుడు పెద్ద ఆరోగ్య సమస్యలు రావచ్చు. దానికి భయపడవద్దు. మనోధైర్యం కోల్పో వద్దు. ఈ కాలంలో ప్రతి ఆరోగ్యసమస్యకు చికిత్స ఉంది. సమస్య గుర్తించడం ముఖ్యం. Early stages లో గుర్తించ గలగడం మన అదృష్డం. దానికి regular health check up చాలా అవసరం.మనకు ఎలాంటి సమస్య లేకున్నా కనీసం సంవత్సరానికి ఒకసారి మొత్తం శరీరం check చేయించుకుందాం.
4. సరియైన time లో మన ఆరోక్యానికి సరిపడే ఆహారం తినడం అలవాటు చేసుకుందాం. మన పనుల ఒత్తిడి పక్కనపెట్టి మూడుపూటలా సకాలంలో భోజనం చేద్దాం. మనకు ఇష్టమైనవి మన ఆరోగ్యానికి సరి పడనివి మితంగానే తీసుకుందాం.
5. వీలైతే ధూమపానం పూర్తిగా మానేద్దాం. మద్యపానం నియంత్రిద్దాం. మనిషికి ఆరోగ్యం లేకపోతే ఆనందం లేదు.
6. ముఖ్యంగా ప్రతిరోజు కనీసం ఒక గంట exercise/Yoga కు కేటాయిద్దాం. Exercise కు మించిన ఆరోగ్య సాధనం, అనారోగ్య నివారిణి ఇంకొకటి లేదు. కొంచెం కష్డమైనా క్రమశిక్షణతో ప్రయత్నించాలి. Walking, jogging, gym, yoga, pranayam ఏదో ఒక వ్యాయామం. వీలైతే ఒకరిద్దరు మిత్రులతో కలిసి. Peer pressure వలనన్న క్రమశిక్షణ అలవడుతుంది.
7. కొంచెం వృత్తిపరమైన ఒత్తిడి తగ్గించుకుందాం. సంపాదన అవసరమే. కాని మనం జీవించి ఉండడం అంతకంటే ముఖ్యం. మనకు మన కుటుంబానికి కూడా. Let's slow down a bit
8. వారానికి ఒక రోజైనా నవ్వుతూ, సంతోషంగా కుటుంబసభ్యులతో, స్నేహితులతో మనకు నచ్చిన entertainment పద్దతిలో గడుపుదాం. సినిమా, ఆటలో, పాటలో, హాబీలో, అభిరుచులో, ఏదో ఒక రీతిలో ఆనందంగా.
9. మనసుకు ప్రశాంతతను, ఆత్మకు తృప్తి ని ఇచ్చే పనులు కూడా చేద్దాం. ధ్యానం, పూజ, దానం, ధర్మం, సేవా ఎంతోకొంత మన జీవితంలో భాగం చేసుకుందాం.
Message పెట్టినందుకు విసుక్కోకుండా మిత్రులందరూ దీని గురించి ఆలోచించాలని స్నేహితుడిగా, శ్రేయోభిలాషి గా మనవి 😊
No comments:
Post a Comment