ఆధ్యాత్మికం
కోరిన వస్తువు దొరికినప్పుడు...
కలిగే ఆనందం నుంచి...
ఆ వస్తువు నశించిపోయినా సరే...
ఆనందంగా ఉండగలిగే స్థితి కలిగే వరకు...
చేసే ప్రయాణమే ఆధ్యాత్మికం...
* * *
ఆనందానికి కారణం వస్తువులు, మనుషులు కారణం కాదు...
అని తెలియజేయడానికే ఆ వస్తువులు, మనుషులు నశించిపోయేట్లు చేశాడు భగవంతుడు.
* * *
ఆభరణాల వెనుక బంగారం ఉన్నట్టు
ఈ సాకారాల వెనుక నిరాకారుడున్నాడు.
* * *
కుమ్మరిచక్రం తిరగటం వెనుక కుమ్మరి ఉన్నట్టు
సృష్టిచక్రం తిరగడం వెనుక సృష్టికర్త ఉన్నాడు.
* * *
ఉనికి (శ్రీధర్) వెనుక శక్తి ఉన్నది.
శక్తి వెనుక చైతన్యం ఉన్నది.
* * *
సకలానికి శక్తి(తల్లి) ఎరుకే...
శక్తికి చైతన్యం(తండ్రి) ఎరుకే...
చైతన్యానికి సకలమూ ఎరుకే...
కానీ సకలానికి చైతన్యం ఎరుక కాదు...ఎప్పటికీ...
No comments:
Post a Comment