నేటి జీవిత సత్యం.
మనిషి ఎప్పుడూ జీవితాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. ఒక శాపంగా దాపురించిన మహమ్మారి సృష్టిస్తున్న విపరీత పరిస్థితులవల్ల మృత్యువు గురించి కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. "నాకు మృత్యువంటే భయం. దీనిలోంచి ఎలా బయటపడగలను' అని అడిగాడు. శిష్యుడు గురువుగారిని 'ఒక్క విషయం చెప్ప. కొన్ని నాణేలను అప్పుగా
తీసుకున్నావనుకో... తిరిగిచ్చేయాల్సి వచ్చినప్పుడు భయపడతావా??
"లేదే... దీనికి దానికి ఏమిటి సంబంధం గురువుగారూ! గురువుగారు భూమి మీద నుంచి కొద్దిగా మట్టిని తీసుకుంటూ- 'నువ్వు ఈ దేహాన్ని రుణంగా తీసుకున్నావు. తిరిగిచ్చేయాలిగా. తీసుకునే ఆహారం, తాగే నీరు నీ రుణాన్ని పెంచుతుంది. దూళిలోంచి తయారైన నువ్వు ఈ భూమికి రుణపడి ఉన్నావు ఆది కిందకు లాగుతూనే ఉంటుంది. చివరికి మొత్తంగా తనలోకి తీసేసుకుంటుంది- ఏమీ మిగల్చకుండా! చేతిలోకి తీసుకున్న ఆ మట్టిని పైకి విసిరాడు. అది కింద పడింది. 'నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎగిరినా కిందపడక తప్పదు. అది సహజం. పడతాననే భయంలోంచి బయటపడాలి. ఈ శరీరానికి ఆధిపతిననే భావనను విడిచిపెట్టాలి. అద్దెకు తీసుకున్నానన్న సత్యాన్ని గ్రహించాలి. అంతా రుణగ్రస్తులమే'
మృత్యువు అనేది అత్యున్నతమైన సత్యమైనా. ఎవరూ ఎప్పుడూ దానిగురించి మాట్లాడుకోవడం గానీ, అవగాహన ప్రయత్నించడంగానీ ఇష్టపడరు. పరిణతి. చెందిన వారుగా కనిపించే వారిలో సైతం, వారి ఆలోచనలు, ఆందోళనలు కుటుంబ వ్యవహారాలు, పదోన్నతులు, వ్యాపార మార్గాలు.. ఇలా భౌతిక
విషయాల చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. మన జననం సాధారణమైనది. కావచ్చు. కానీ మరణం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలనేవారు అబ్దుల్
గీతలో కృష్ణుడు. చివరి శ్వాసలో హరినామాన్ని స్మరిస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంటాడు. అర్జునుడు అదెంతో తేలిక విషయం అన్న భావం వ్యక్తంచేసినప్పుడు, జీవితంలో ఆ నామాన్ని జపించే అభ్యాసం లేకపోతే తుది క్షణాల్లో ఉచ్చరించడం సాధ్యంకాదని నవ్వుతూ చెబుతాడు శ్రీకృష్ణుడు. చివరి ఆలోచన అనేది మనిషి అంతవరకూ గడిపిన జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నపళంగా వచ్చే మార్చంటూ జీవితంలో ఉండదు. భౌతిక సంపదల పట్ల ఆకర్షితులైనవారికి, 'నేను- నాది' అనుకుంటూ స్వార్ధ బుద్ధితో జీవితం గడిపేవారికి 'హరినామ స్మరణ" అంత తేలికైన విషయం కాదు.
ప్రతి ఒక్కరూ తుది ప్రయాణానికి సిద్ధపడాల్సిందే. జీవితాన్ని ఒక ఉత్సవంలా ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటూనే మరణించే కళను నేర్చుకోవాలి. ఆశాశ్వతమైన శరీరాన్ని పెనవేసుకున్న బంధాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. తరువాతి తరాలవారికి అందించాల్సినవి శాశ్వతమైన విలువగలిగినవి- సంస్కారాలు, విలువలు,
మధురానుభూతులు, ప్రగతిశీల ఆలోచనలని తెలుసుకోవాలి. మానవ దేహం పంచభూతాల సమ్మేళనం, మట్టిలో కలవాల్సిందే. మట్టితో కాలమనే చక్రంమీద దైవం నగిషీలు పెట్టి తీసే అందమైన మట్టికుండ- మనిషి జన్మ. ఈ భూమ్మీద మనిషిది తాత్కాలిక నివాసమే! |
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment