💖💖💖
💖💖 *"306"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"అభిరుచులు సాధనకు ముందుకు సాగనివ్వటంలేదు ఎలా ?"*
******
*"సాధనకు అభిరుచులను ముడి పెట్టుకోవడం తొలి అడ్డంకి. మనసుకు సంబంధించిన ధ్యానంతో స్థలానికి, కాలానికి ఏ సంబంధమూలేదు. ఏ స్థలంలోనైనా, ఏకాలంలోనైనా దైవాన్ని స్మరించేందుకు అవకాశమున్న మనసుకు మనమే నిబద్ధతను, నిబంధనలను విధించుకుంటున్నాం. మనకి బాగా ధ్యానం చేయాలని ఉంటుంది. కానీ అందుకు ఒక అనువైన స్థలం, వాతావరణం లేదన్న కారణాన్ని తీసుకొని వాయిదా వేస్తుంటాం. శారీరక సౌకర్యానికి, మనసుచేసే జపానికి ఏ సంబంధమూ లేదు. మన అభిరుచులను ముడి పెట్టుకోవడమే అవరోధం. మనసుకు సంబంధించిన శాంతిని, భౌతిక విషయాలను కలపాలనుకోవటం నీరు-నూనెలను కలపటం లాంటిదే ! ఎలాంటి సాకులు, వంకలులేని సాధనకు ఉపక్రమించగలిగితే మనలోని నిశ్శబ్దాన్ని వినే అర్హత వస్తుంది. మనం ఉండటమే దైవానుగ్రహం అన్న సత్యదృష్టి వస్తే గానీ మనసు భౌతిక విషయాలతో నిమిత్తంలేని శాంతిని పొందగలుగుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
🌼💖🌼💖🌼
No comments:
Post a Comment