Monday, September 12, 2022

మంచి మాట.లు(05-09-2022)

05-09-2022:-సోమవారం
ఈ రోజు AVB మంచి మాట.లు
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపటానికి అంకితభావంతో నిత్యం నిస్వార్ధంగా శ్రమిస్తున్నా ప్రతి ఉపాధ్యాయునికి గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు💐🙏

ఏదైనా పంచే కొద్ది తరుగుతుంది, కానీ విద్యా పంచేకొద్దీ పెరుగుతుంది అలాంటి విద్యను నిస్వార్థంగా పంచే గురువులకు పాదాభివందనం

ప్రపంచానికి భగవద్గీతను బోధించిన విశ్వగురు శ్రీకృష్ణ భగవానుడు గురువులందరికి ఆదర్శం కావాలి
.
జ్ఞానం సంపాదించటం కన్నా సంపాదించిన జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవటం లోనే మనిషి విజయం ఉంది.

జ్ఞానం తో చెప్పేవాడి మాట విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి..

భవిష్యత్ లో ఎం జరుగుతుందో అని ఎప్పుడు భయపడేవారు ఏమి సాధించలేరు...

ఏది ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి గురువు కావాలి.. మంచి గురువు దొరికితే.. విద్య తో పాటుగా వినయం మరియు సంస్కారం కూడా దొరుకుతుంది.. కుల మతాలకు అతీతంగా అందరికీ లభ్యమయ్యేది విద్య మాత్రమే
సేకరణ ✍️ AVB సుబ్బారావు

No comments:

Post a Comment