గురు వారం --: 08-09-2022 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
జీవితాన్ని గొప్పగా ఊహించు కుంటూ బతికేవారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు . శ్రమించే వారు ఎడారినైనా నందనవనం చేస్తారు సోమరిపోతు బంగారు గనిలో ఉన్నా బికారిగానే ఉంటాడు .
ఈ రోజుల్లో మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచిని ఆకర్షించ లేదు . ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలపాలు చేస్తుంది . మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది .
జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది . ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంత కాలం మాత్రమే ఉంటుంది . ఏది ఎప్పుడు వదలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు అపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత కాలం వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే .
భరోసా లేని బతుకు
ఎదుగుదల ఆలోచన లేని వ్యక్తి
ఒళ్ళు ఆకారాన్ని చూసి ఆనందపడే మనిషి
నోరు అదుపు లేని జీవితం చరిత్రలో ఎక్కడ సుఖ పడినట్టు లేదు
మనకు కావాలిసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం , మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టే దానికి ఇంకొకరిని కారణం చేయడం రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నీవు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మరచిపోకు .
ఎవరు ఎంత కాలం కలిసుంటారు అనేది ఎవ్వరూ చెప్పలేం కానీ దూరం ఉన్నంత మాత్రాన బంధాలు" తెగిపోవు, అర్థం చేసుకునే మనసు ఉంటే దగ్గర దూరం అనేది ముఖ్యం కొదు . బంధం పెరగడం తగ్గడం అనేది మన ఆలోచనతో అర్థం చేసుకునే మనుషుల్ని బట్టి ఉంటుంది .
తగ్గిన ప్రతివాడూ చేతకాని వాడు అనుకుంటే అది మన పొరపాటే, కొన్నిసార్లు నెగ్గిన వాడికన్న తగ్గిన వాడికే మేలు జరుగుతుంది . అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు,వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకు ఏం చేసినా మన విలువ తెలియదు .
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝 📞9985255805🙏
No comments:
Post a Comment