Monday, September 12, 2022

మంచి మాట..లు(11-09-2022)

11=09=2022, ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట..లు

స్నేహం, పుస్తకం, దారి, ఆలోచనలు , ఈ నాలుగు సరైనవి దొరికితే, జీవితం సాఫల్యం అవుతుంది, లేదంటే వైఫల్యం అవుతుంది,, గుర్తుంచుకోండి, ఏదైనా మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది,,

99సార్లు సహాయం చేసి 100 వ సారి ఏదైనా ఇబ్బంది ఉండి కుదరదుఅంటే, ఆ 100 వసారి కుదరదన్న పదాన్నే గుర్తుపెట్టుకునే మనుషుల మధ్య బతుకుతున్నాం మనం, తస్మాత్ జాగ్రత్త,,

అసూయా పడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం,, ఆవేశపడేవారితో మన ఆలోచనల్ని పంచుకోవడం నిజంగా మన మూర్కత్వం అవుతుంది,, ఇది నేను అనుభవించి చెపుతున్నా,,

జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చి మనం ఒక స్థాయికి ఎదిగినాక, ఆ ఎదిగిన అనుభవం తో ఎవరికైనా సహాయం చేద్దాం అనుకుని ఏదైనా చేస్తే, ఇందులో వీడికి ఎంత లాభం ఉందో అని అనుమాన పడే మనుషులున్నారు,,

జీవితంలో ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం బాదేమిటో... మనం చేసినప్పుడు అర్థం కాదు మనకు , ఎవ్వరైనా మనల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు అర్థం అవుతుంది, ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది నొప్పి..అనేది
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు🕉️🚩🌹🤝

No comments:

Post a Comment